విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తోటివారిని ప్రేమించాలన్న ఏసుక్రీస్తు మార్గంలో అందరూ నడవాలని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. శుక్రవారం నాడు గుణదల అశోకా గార్డెన్స్ నందు యం.యం సెయింట్ జాన్స్ ఇవాంజలికల్ చర్చ్ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్ పాల్గొని నూతనంగా నిర్మించిన చర్చ్ బిల్డింగ్ ను ప్రారంభించి దైవజనులచే నిర్వహించబడిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు, స్థానికులు ఆయన్ని సన్మానించారు. అవినాష్ మాట్లాడుతూ.. అందరినీ ప్రేమతో చూడాలన్న ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి దారి చూపాయన్నారు. ఆయన చూపిన బాటలో అందరూ తోటివారిని ప్రేమిస్తూ కలిసి మెలిసి జీవించాలని కోరారు.
Prajavartha Online Telugu News