Breaking News

పేదల ఉన్నతికి పథకాలు దోహదం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-25 వ డివిజన్ 96 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 25 వ డివిజన్ 96 వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతలదేవి భాస్కర్, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. తాడిచెట్ల వారి బజార్, మూర్తి వీధి, కోకా వారి వీధి, గార్లపాటి వారి వీధి, రామస్వామి వారి వీధులలో విస్తృతంగా పర్యటించి 312 ఇళ్లను సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రజలు విన్నవిస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండటంతో మంచి స్పందన వస్తోందన్నారు. పర్యటనలో భాగంగా అర్హులైన పలువురికి రేషన్ కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్మిక, కర్షక, మహిళ, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై గ్రీవెన్స్ స్వీకరించారు. తాడిచెట్ల బజార్, మూర్తి వీధులలో దెబ్బ తిన్న రోడ్ల పున: నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

మూడున్నరేళ్లలో రూ. 310 కోట్ల సంక్షేమం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యంలో నియోజకవర్గ ప్రజలకు అక్షరాలా రూ. 310.46 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 26,418 మందికి ప్రతినెలా క్రమం తప్పకుండా ఇంటివద్దకే పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 28,834 మందికి రూ. 118.98 కోట్లు., విద్యాదీవెన ద్వారా 15,024 మందికి రూ. 35.50 కోట్లు., వసతి దీవెన ద్వారా 15,024 మందికి రూ. 13.68 కోట్లు., చేయూత ద్వారా 8,542 మందికి రూ. 39.01 కోట్లు., కాపునేస్తం ద్వారా 2,088 మందికి రూ. 8.87 కోట్లు., సున్నావడ్డీ ద్వారా 44,370 మందికి రూ. 17.26 కోట్లు., చేదోడు ద్వారా 2,112 మందికి రూ. 5.51 కోట్లు., ఆసరా ద్వారా 32,510 మందికి రూ.56.35 కోట్లు., వాహనమిత్ర ద్వారా 2,916 మందికి రూ. 7.04 కోట్లు., ఈబీసీ నేస్తం ద్వారా 1,947 మందికి రూ.2.92 కోట్ల ఆర్థిక చేయూతను మూడున్నరేళ్లలో అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చూసి ఓర్వలేక ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు విష ప్రచారం సాగిస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మల్లాది విష్ణు విమర్శించారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. రాక్షస ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పోలీస్ వ్యవస్థఫై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టాలను, జీవోలను గౌరవించాల్సిన బాధ్యత.. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుపై ఉందని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం సోషల్ మీడియా చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు, దాడులకు ఏ మాత్రం స్థానం లేదని తెలియజేశారు. రెచ్చగొట్టే పోస్టులు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించబోమని.. ఇష్టానుసారంగా తప్పుడు వార్తల్ని వైరల్ చేసేవారిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఫేక్ పోస్టులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు బంకా భాస్కర్, నాగేశ్వరరెడ్డి, రఫీ, అబ్దుల్ నజీర్, అలీ అన్సారీ, కోలంటి రవి, చినబాబు, భోగాది మురళి, బెజ్జం రవి, కనపర్తి కొండా, బంకా వెంకటేష్, లతీఫ్, వి.బి.ఆచారి, భాష, బబ్లూ, లక్ష్మణ, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *