Breaking News

వివేకానందుని బోధనలు ఆచరణీయం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానందుని మార్గం అంద‌రికీ ఆద‌ర్శణీయ‌మ‌ని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జాతీయ యువ‌జ‌నోత్సవాన్ని పుర‌స్కరించుకుని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రాఘవయ్య పార్కు వద్ద జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్వామి వివేకానందుని బోధనలను మననం చేసుకున్నారు. భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలలో పతాక స్థాయికి చేర్చిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు. హిందుత్వంలోని గొప్పదనాన్ని లోకానికి చాటిచెప్పిన గొప్ప ఆధ్యాత్మికవేత్త అని కీర్తించారు. యువతను మంచిమార్గంలో నడపడానికి.. వారిని చైతన్య పరచడానికి ఆయన ప్రపంచమంతా తిరిగి ఎన్నో ప్రసంగాలు చేశారన్నారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న వివేకానందుని బోధన సారాన్ని ఆదర్శంగా తీసుకొని యువత సేవామార్గంలో పయనించాలని కోరారు. ఆ మహనీయుని స్ఫూర్తితో ముందుకు సాగితే తిరుగులేని విజయాలు స్వంతం అవుతాయని చెప్పారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి యువతకు పెద్దపీట వేస్తున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగపరచుకొని.. యువత ఆత్మ విశ్వాసంతో లక్షం వైపు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈవో U.శ్రీనివాసరావు, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, 25వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్, నాయకులు వెన్నం రత్నారావు, శనగశెట్టి హరిబాబు, బెజ్జం రవి, రఫీ, నేరెళ్ల శివ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *