Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 2.60 లక్షల విలువైన ఎల్ఓసి పత్రం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు సంజీవని వంటిదని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 64 వ డివిజన్ కండ్రికకు చెందిన పొన్నపల్లి హర్షసాయి(11) పుట్టుకతో వినికిడి సమస్యతో బాధపడుతుండగా.. కాక్లర్ ఇంప్లాంటేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ మేరకు బాలుడికి మంజూరైన రూ. 2.60 లక్షల ఎల్ఓసి పత్రాన్ని గురువారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి తేవాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు. అలాగే అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదే చంద్రబాబు పాలనలో పేద రోగులు ఆర్థిక భారంతో చితికిపోయేవారని.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి అందుతోందన్నారు. అలాగే అత్యవసర సమయాల్లో రోగులకు ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై అవగాహన కల్పించేందుకు.. జనహిత సదనములో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ప్రజలు సద్వినియోపరచుకోవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తమకు చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి బాలుడి కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *