Breaking News

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాలను ప్రణాళిక సిద్ధం చెయ్యండి

-ఎంపీడీఓ – హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-ప్రతి వారం రెండు రోజులు హౌసింగ్ పై రివ్యూ చెయ్యడం జరుగుతుంది
-కలెక్టర్ మాధవీలత
-సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి లక్ష్యాలు నిర్దేశించాలి.. జేసీ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 59,850 ఇళ్ళ నిర్మాణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 13785 ఇళ్ళు నిర్మాణం చేసి మంచి పురోగతి సాధించారని కలెక్టర్ డా కె. మాధవీలత అభినందించారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం రాత్రి హౌసింగ్ పై సూక్ష్మ స్థాయి ప్రణాళిక పై మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. తదుపరి సచివాలయ వ్యవస్థ, ఉపాధి హామీ పై సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ఉగాది నాటికి మన ముందు ఉన్న 6196 ఇళ్ళ నిర్మాణం పూర్తి చెయ్య వలసి ఉందన్నారు. ప్రతి రోజు 19 మండలాల్లో పరిధిలో ఉన్న ఇళ్ళ నిర్మాణాల లక్ష్యం 103 సగటు ఉందన్నారు. ఆమేరకు ప్రతి ఎం పి డి ఓ ప్రతి రోజు పూర్తి చేయవలసిన లక్ష్యలు సింగిల్ డిజిట్ లో మాత్రమే ఉందన్నారు. రాజమహేంద్రవరం పరిధిలో ప్రతి రోజూ 16 ఇళ్ళ స్టేజ్ కన్వర్షన్ చెయ్య వలసి ఉందని అన్నారు. జిల్లాలో బిబిఎల్ లో ఉన్న 38,936 ఇళ్ల ను ప్రతి ఒక్క గృహం తదుపరి స్టేజ్ కన్వర్షన్ పై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు, మెటీరియల్ కి సంబందించిన ఎటువంటి సమస్య ఉన్నా ఉన్నత అధికారుల దృష్టి కి తీసుకుని రావాలన్నారు. లే అవుట్ లకి వెళ్ళే రహదారుల అభివృద్ధి పనులకు, బోర్లు ఏర్పాటు పై ఎంపిడివో లు చర్యలు తీసుకోవాలన్నారు. గత వారం స్టేజ్ కన్వర్షన్ నిర్దేశించిన లక్ష్యాలలో 1079 ఉండగా 649 పూర్తి చేశారని అన్నారు. ప్రతి వారం లక్ష్యాలను పూర్తి చేసే, తదుపరి కన్వర్షన్ సులభతరం అవుతుందని అన్నారు. మండల వారిగా పనులు పూర్తి చెయ్యడం కోసం ప్రత్యేక అధికారులు, హౌసింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాలలో మిగిలి ఉన్న ఇళ్ళ నిర్మాణాలలో స్టేజ్ కన్వర్షన్ ఇంకా 5933 పెండింగు ఉన్న దృష్ట్యా వాటికి అనుగుణంగా లే అవుట్ వారీగా యాక్షన్ ప్లాన్ మేరకు అడుగులు వేయడం ముఖ్యం అన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ సహాయకులకు లక్ష్యాలను నిర్దేశించి, వారికి ట్యాగ్ చేసిన లబ్దిదారుల తో తరచుగా మాట్లాడడం ద్వారా చైతన్యం తీసుకుని రావాలన్నారు.

ఉపాధి హామీ పథకం పై జిల్లాకు నూతనంగా 59 లక్షల పనిదినాలు ఇవ్వగా, ఆ మేరకు ఇప్పటి వరకు 43.26 లక్ష్యాలు (73.32 %) సాధించడం జరిగిందని కలెక్టర్ మాధవీలత అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కొంత వేజెస్ కల్పించ లేక పోయారని, ఆమేరకు రానున్న రోజుల్లో మరిన్ని ఉపాధి హామీ పని దినాలు కల్పించడం పై దృష్టి పెట్టాలని అన్నారు.

గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థ :
జిల్లాలో సచివాలయ వ్యవస్థ లో పనిచేసే సిబ్బంది, వాలంటీర్ ల యొక్క హాజరు శాతం ఇన్ – అవుట్ లో వ్యత్యాసం లేకుండా చూడాలన్నారు. అదే విధంగా సచివాలయం ద్వారా అందించే పౌర సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలని మాధవీలత పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి సగటు కంటే మెరుగైన సేవలు అందించే జిల్లాల లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా హోసింగ్ అధికారి బి. తారా చంద్, ప్రత్యేక అధికారులు జీ ఎస్ రామ్ గోపాల్, డా ఎస్ జీ టి సత్య గోవింద్, డిఎల్ డిఓ వి. శాంత మణి, పి. వీణా దేవి , 19 మండలాల ఎంపిడివో లు, హౌసింగ్ డివిజన్ ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *