-మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్ అభినందనలు
-నాకు స్ఫూర్తి నిచ్చిన కలెక్టర్ మేడం: వర్రీ జేష్ణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారి వర్రీ జేష్ణ జాతీయ ఆర్చరీ అండర్ -9 విభాగం లో నిర్వహించిన నాలుగు అంశాల్లో పతకాలు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి తాను సాధించిన పతకాలు కలెక్టర్ వద్ద ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత పిల్లల్లో ఉన్న ఆసక్తి గమనించి ప్రోత్సహిస్తే ఏదైనా సాధించవచ్చు అనడానికి వర్రీ జేష్ణ ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. విజయవాడ వి ఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జనవరి 14, 15 తేదీల్లో జరిగిన జాతీయ అండర్ 9 కేటగిరీ ఆర్చరీ విభాగంలో నిర్వహించిన నాలుగు అంశాల్లో మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించడం ఆమె లో పోటీ తత్వం కు నిదర్శనం అన్నారు.
నాకు స్ఫూర్తి నిచ్చిన కలెక్టర్ మేడం: వర్రీ జేష్ణ
ఇటీవల ఇస్కాన్ టెంపుల్ వద్ద జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కలెక్టర్ మాధవీలత ప్రసంగం విని తాను ప్రేరణ పొందినట్లు వర్రీ జేష్ణ పేర్కొనడం జరిగింది.
బాలికలు ఎందులోనూ తక్కువ కాదన్న మాటలు తనపై ప్రభావం ఎక్కువగా చూపించిందని అన్నారు. మిమ్మల్ని కలిసి నా విజయం మీతో పంచుకునే అవకాశం పట్ల ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి వారి నుంచి స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా కోచ్ నాళం రామ్ కుమార్, వర్రీ జేష్ణ తండ్రి ఈశ్వర్ ప్రభాకర్ లను కూడా కలెక్టర్ మాధవీలత అభినందించారు.
Prajavartha Online Telugu News