Breaking News

జనవరి 18 నుంచి 24 వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు

-ప్రతి ఒక్కరికి రహదారి భద్రత పై కనీస అవగాహన అవసరం
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారి భద్రత వారోత్సవాల ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువత, వాహన చోదకులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఈరోజు నుంచి నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా కరపత్రాలు, గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను 2023 జనవరి 18 నుంచి 24వరకు నిర్వహించు కోవడం జరుగుతుందని తెలిపారు. రహదారి భద్రతా విషయంలో ” యువశక్తితోనే మార్పు” అనే నినాదంతో ఏడు రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించు కోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ వారోత్సవాల లో రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీస్, కళాశాలల్లో అవగాహన సదస్సులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ వాహనాల డ్రైవర్లకు రహదారులలో తరచుగా సంభవించే ప్రమాదాల నివారణ పై అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రవాణా శాఖ అధికారులు, అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డి టి సి కె.ఎస్ యమ్.వి కృష్ణారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు రంగనాయకులు, . సంపత్,రామ్ నారాయణ్ , సహాయ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు శ్రీదేవి, రాదిక, సుమా, సబితా పొల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *