Breaking News

రిటైల్‌ విభాగంలో ఏపీ లో మార్కెట్‌ లీడర్‌గా ఇండియన్‌ ఆయిల్‌


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిటైల్‌ విభాగంలో, ఆంధ్రప్రదేశ్‌లో మార్కెట్‌ లీడర్‌గా ఇండియన్‌ ఆయిల్‌ నిలిచిందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్ బి.అనిల్ కుమార్ తెలిపారు. గురువారం కొండపల్లి టెర్మినల్ ఇండియన్ ఆయిల్ కంపెనీ విజిట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాత్రికేయులకు ఇండియన్ ఆయిల్ కంపెనీ లో పైపులైన్ లు, ఇంధనం నిల్వలు, ఎమెర్జెనీ, ప్రమాదాల నుండి ఎలా రక్షించాలి అనే అంశాలపై క్లుప్తంగా ఇండియన్ ఆయిల్ కంపెనీ రక్షణ అధికారులు వివరించారు. ఇండియన్ ఆయిల్ గురించి బి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడ పెట్రోల్‌ విభాగంలో 34.2%, డీజిల్‌లో 40% వాటాను సొంతం చేసుకుందన్నారు. గృహ ఎల్‌పీజీ వ్యాపారంలో ఇండియన్‌ ఆయిల్‌ మార్కెట్‌ వాటా దాదాపు34.6%గా ఉందన్నారు. ఇండియన్‌ ఆయిల్‌ 1570 రిటైల్‌ ఔట్‌లెట్లతో శక్తివంతమైన మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాలను కలిగి ఉందన్నారు. దీనికి విజయవాడ, వైజాగ్‌, రాజమండ్రి, చిత్తూరు, ఒంగోలు, కాకినాడ మరియు గుంతకల్‌లోని నిల్వ సదుపాయాలు మద్దతు అందించడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌ ఇంధన అవసరాలను గణనీయంగా తీర్చడంలో తోడ్పడుతున్నాయన్నారు.
గత మూడు సంవత్సరాలలో ఇండియన్‌ ఆయిల్‌ 259 రిటైల్‌ ఔట్‌లెట్లను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిందని, ఈ రిటైల్‌ ఔట్‌లెట్లన్నీ కూడా జరిగే లావాదేవీలను పర్యవేక్షించేందుకు రియల్‌ టైమ్‌ డాటా ట్రాన్స్‌ఫర్‌ మానిటరింగ్‌ చేత ఆటో మేట్‌ చేయబడ్డాయన్నారు.
ఇండియన్‌ ఆయిల్‌ ఇప్పుడు రాష్ట్రంలో 473 రిటైల్‌ ఔట్‌లెట్లను సోలరైజ్‌ చేసిందని, ఈ ఔట్‌లెట్ల వ్యవస్ధాపక సామర్ధ్యం 2700 కిలోవాట్‌. భారతదేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఈ–మొబిలిటీ ధోరణికి అనుగుణంగా 138 ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటుచేసిందన్నారు. ఈ సంవత్సరంలో మరో 200 చార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటుచేయనున్నారన్నారు. ఇండియన్‌ ఆయిల్‌ ఇప్పుడు సీఎన్‌జీని సైతం తమ సీజీడీ ఆపరేటర్లతో భాగస్వామ్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో 64 రిటైల్‌ ఔట్‌లెట్ల ద్వారా మార్కెట్‌ చేస్తుంది. ఈ సంవత్సరంలో మరో 16 సీఎన్‌జీ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారని తెలిపారు. ఫిక్కీ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును సైతం ఇది అందుకుందని పేర్కొన్నారు. సమావేశంలో చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *