Breaking News

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల కోసమే బెనిఫిట్ మెడిక‌ల్ బ‌జార్


-ఈ నెల 23న విద్యాధ‌ర‌పురం సితార సెంట‌ర్‌లో ప్రారంభం
-అత్యంత చౌక‌యిన వైద్యం, ఔష‌ధాలు అందుబాటులో
-కేవ‌లం రూ.10కే వైద్య సేవ‌లు
-నిర్వాహ‌కుల సేవాభావాన్ని గుర్తిద్దాం: ప్ర‌ముఖ న‌టీమ‌ణి న‌వీనా జాక్స‌న్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవ‌ల కాలంలో సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లపై ప‌డుతున్న వైద్య చికిత్స, ఔష‌ధాల ఖ‌ర్చుల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించేందుకు, ఫార్మా రంగంలో త‌మ‌కున్న 25 సంవ‌త్స‌రాల అనుభ‌వాన్ని మేళ‌వించి 23న తాము నూత‌నంగా ప్రారంభిస్తున్న వ్యాపారాన్ని సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని బెనిఫిట్ మెడిక‌ల్ బ‌జార్ అధినేత తాతా వెంక‌ట సుబ్ర‌హ్మ‌ణ్యం అన్నారు. మ‌హాత్మాగాంధీ రోడ్డులోని టిక్కిల్ రోడ్డులో ఉన్న హోట‌ల్ మ‌నార్ ఫుడ్‌ప్లాజాలో శ‌నివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తాతా వెంక‌ట సుబ్ర‌హ్మ‌ణ్యం మాట్లాడుతూ.. లాభాపేక్ష ర‌హితంగా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని సంర‌క్షించేందుకు గ‌ట్టి సంక‌ల్పంతో తాము ఈ వ్యాపారాన్ని అంద‌రికీ అందుబాటులోకి తేవాల‌నే ఉద్దేశంతో సాధార‌ణ మందుల దుకాణాల్లో ల‌భించే ధ‌ర‌ల కంటే అత్యంత చౌక‌యిన ధ‌ర‌ల‌కే నాణ్య‌మైన మందుల‌ను విక్రయించ‌నున్న‌ట్లు చెప్పారు. మందుల‌పై 80శాతం వ‌ర‌కు రాయితీ కూడా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. న‌గ‌ర‌వాసులంద‌రికీ బాగా ప‌రిచ‌యం ఉన్న, మాన‌వ‌తా దృక్ఫ‌దం క‌లిగిన కొంత‌మంది వైద్యుల ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిరోజూ సాధార‌ణ, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు వైద్య సేవ‌లు కూడా కేవ‌లం రూ.10ల ఫీజుతోనే అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 23న ఉద‌యం విద్యాధ‌ర‌పురంలోని సితార సెంట‌ర్‌లో నూత‌నంగా నిర్మించిన భ‌వ‌నంలో బెనిఫిట్ మెడిక‌ల్ బ‌జార్ మందుల దుకాణాన్ని మాజీ మంత్రి, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీనివాస్‌, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మీ ఇత‌ర ప్ర‌ముఖుల చేతుల మీదుగా ప్రారంభిస్తున్న‌ట్లు చెప్పారు. విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్న ప్ర‌ముఖ న‌టీమ‌ణి న‌వీనా జాక్స‌న్ మాట్లాడుతూ.. స‌మాజం నుంచి ఎంతో కొంత ల‌బ్ధి పొందిన ప్ర‌తిఒక్క‌రూ తిరిగి స‌మాజ సేవ కోసం ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. బెనిఫిట్ మెడిక‌ల్ బ‌జార్ నిర్వాహ‌కుల సేవా దృక్ప‌ధం మ‌రింత మందికి స్ఫూర్తినివ్వాల‌ని ఆమె ఆకాంక్షించారు. తాతా వెంక‌ట సుబ్ర‌హ్మ‌ణ్యం సేవాభావం త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని, మ‌ధ్యత‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇక్క‌డ అందుబాటులో ఉన్న ధ‌ర‌లు, అందిస్తున్న వైద్య సేవ‌ల‌ను భ‌విష్య‌త్తులో ప్ర‌సార‌మాధ్య‌మాల ద్వారా ప్ర‌చారం చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా బెనిఫిట్ మెడిక‌ల్ బ‌జార్ బ్రోచ‌ర్‌ను ఆవిష్క‌రించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *