Breaking News

పేదలంతా సుభిక్షంగా ఉండాలంటే టిడిపి అధికారంలోకి రావాలి… : ఎమ్ ఎస్ బేగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజల్లో నెలకొన్న అనిచ్చితి ప్రజలు పడుతున్న అనేక ఇబ్బందులకు నిరసనలకు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అను నినాదంతో ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) ఆదేశాలతో 47 వ డివిజన్ పార్టీ అధ్యక్షులు కూరాకుల కనక మల్లేశ్వరరావు నాయకత్వంలో క్లస్టర్ ఇంఛార్జి యేదుపాటి రామయ్య , యూనిట్ ఇంఛార్జి నమ్మి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో డివిజన్ లోని చిట్టినగర్ కుండల మార్కెట్ ప్రాంతంలో టీమ్ టిడిపి నాయకులతో కలసి ఇంటింటికీ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు సేకరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిధులుగా టిడిపి నాయకులు ఎమ్ ఎస్ బేగ్, ఎన్ టి ఆర్ జిల్లా టిడిపి కార్యాలయ కార్యదర్శి సారిపల్లి వెంకట రాధాకృష్ణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సుకాసి కిరణ్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బెవర సాయి సుధాకర్, జిల్లా పార్టీ కార్యదర్శి నీలం వెంకట నారాయణ పాల్గొన్నారు.

టిడిపి నాయకులు ఎమ్ ఎస్ బేగ్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల వల్ల పేద ప్రజలు అనేక ఇక్కట్ల పాలయ్యారని చిన్న చిన్న వ్యాపారాలు విచ్ఛిన్నం అయ్యాయని చేతి వృత్తులు , చిరు ఉద్యోగాలు చేసుకునే వారి కుటుంబాలు అప్పులపాలైపోయారని మళ్ళీ పేదలంతా సుభిక్షంగా ఉండాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిన అవస్యకత ఉందని అన్నారు.

క్లస్టర్ ఇంఛార్జి యేడుపాటి రామయ్య మాట్లాడుతూ ఎంపి కేశినేని నాని నాయకత్వంలో పశ్చిమలో పార్టీ బలపడిందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పశ్చిమలో టిడిపి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నదని 2024 లో పశ్చిమలో టిడిపి జెండా ఎగరటం తద్యమన్నారు.

డివిజన్ పార్టీ అధ్యక్షులు కూరకుల కనక మల్లేశ్వరరావు మాట్లాడుతూ డివిజన్ లో ఇప్పటికే అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారని ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు సేకరించి ఎంపి కేశినేని నాని ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలు తమ సమస్యలను నియోజక వర్గం పార్టీ కార్యాలయం నంబర్ 7798447185 కి కూడా పంపవచ్చునని వారి వివరాలు గోప్యంగా ఉంచి సమస్యల మీద పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీమ్ టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు పలికారు.

డివిజన్ పార్టీ నమ్మి భాను ప్రకాష్, యర్రా రామారావు, ఇట్టా భవాని, కానుళ్ల శేఖరు, కిలాడి కామేష్, భాషా భాయ్, కంబాల దుర్గారావు, ఎస్.కె జిలాని, వానపల్లి శ్రీనివాసరావు, రెడ్డి చర్ల అశోక్ రాజ్, గడ్డిపాటి కిరణ్, చిలక రాజు రాంబాబు, దారా ఆనంద్, ఎర్రమల పుష్ప రాజ్, బొరాడ వెంకటేశ్వరరావు, వంజరపు దుర్గారావు, ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *