Breaking News

లబ్దిదార్లు తమ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా చేసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పేదలందరికీ ఇళ్ళ పధకంలో లబ్దిదార్లు తమ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా చేసుకోవాలని, ఈ నెలాఖరుకి స్లాబ్ ల నిర్మాణం జరగాలని నగర కమిషనర్  కీర్తి చేకూరి ఐఏఎస్  తెలిపారు. శనివారం లాం గ్రామంలోని జగనన్న లే అవుట్ లో ఇళ్ళ నిర్మాణాల పురోగతిని ఆర్.డి.ఓ., గృహ నిర్మాణ, నగరపాలక సంస్థ అధికారులతో కలసి పరిశీలించారు.
తొలుత లే అవుట్స్ లో ఎన్ని ఇళ్లు నిర్మాణాలకు మంజూరు అయింది, నిర్మాణంలో ఉన్న ఇళ్ళ సంఖ్య వాటిలో బిలో బేస్మెంట్ లెవల్, బేస్మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఆర్ సి, పూర్తి అయినవాటి తదితర వివరాలను హౌసింగ్ ఈఈ కమిషనర్ కు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లాం లోని జగనన్న లేఅవుట్ లో లబ్దిదారులు కొందరు స్వంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారని, కొందరు నిర్మాణం కాంట్రాక్టర్ కు అప్పగించారన్నారు. లబ్దిదారులు తమ ఇళ్ళ నిర్మాణం వేగవంతంగా చేసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణానికి నీటి వసతి, విద్యుచ్చక్తి వంటి మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, లబ్దిదారులు త్వరగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసి, ఈనెల చివరికి స్లాబ్ పూర్తి చేసేలా చూడాలన్నారు. లే అవుట్ రహదార్లకు మరమత్తులు చేపట్టాలని హౌసింగ్ ఈఈ ని ఆదేశించారు. లెవలింగ్ కోసం అవసరమయ్యే గ్రావెల్ ను స్థానిక తహసీల్దార్ తో సమన్వయం చేసుకోలన్నారు. లబ్దిదారుల ప్లాట్ లు, లైన్లు కనిపించేలా మార్కింగ్ చేయాలని, అందుకు ప్లానింగ్ కార్యదర్శులను కేటాయించాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. విద్యుత్ లైన్లను ఆ శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. లే అవుట్ లో నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన పనుల వేగవంతంకు డి.ఈ.ఈ. స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించి, ప్రతి రోజు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. సచివాలయాల వారీగా లబ్దిదారులకు ఎమినిటి కార్యదర్శులు ఇళ్ళ నిర్మాణం పై అవగాహన కల్గించి, వారికి నిర్మాణ దశల్లో బిల్స్ కూడా ప్రాసెస్ చేస్తున్నారని తెలిపారు. ఇళ్ల నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్ ప్రతి రోజు 30 ఇళ్లు బేస్మెంట్ లెవల్ ఇచ్చేలా చూడాలని హౌసింగ్ ఈ.ఈ.ని ఆదేశించారు.
అనంతరం ఇళ్ళ నిర్మాణం కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్ ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ యూనిట్ ని పరిశీలించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమణాలు పాటించాలన్నారు.
పర్యటనలో ఆర్.డి.ఓ. ఎం.ప్రభాకర రెడ్డి, నగరపాలక సంస్థ ఎస్.ఈ. భాస్కర్, డి.ఈ.ఈ. మహ్మద్ రఫిక్, హౌసింగ్ ఈ.ఈ. శంకరరావు, డిఈఈ ఆంజనేయులు, తాడికొండ తహసీల్దారు ఫణీంద్రబాబు, సచివాలయ ఎమినిటి కార్యదర్శులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *