Breaking News

వైయస్సార్ సేవాదళ్ నాయకులు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి… : ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన చినిమిల్లి వెంకటరాయుడు ని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఉభయ జిల్లాల వైయస్సార్ సేవాదళ్ కన్వీనర్ గా నియమించడం జరిగింది.  ఈ సందర్భంగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం రాయలంలో వైయస్సార్ సేవాదళ్ కన్వీనర్ చినిమిల్లి వెంకటరాయుడు అధ్యక్షతన మండలాల కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరావు, భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్, వైయస్సార్ సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ కోటంరెడ్డి గిరిందర్ రెడ్డి, ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గూడూరు ఉమ్మ బాలలు పాల్గొని మాట్లాడారు. వివిధ హోదాలు కలిగిన నాయకులు వైయస్సార్ సేవాదళ్ జిల్లా మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *