Breaking News

క్షేత్ర స్థాయిలో పారిశుధ్య నిర్వహణ తీరు పరిశీలన

-విధులలో అలసత్వం వహించకుండా భాద్యతగా నిర్వర్తించాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ సోమవారం ఉదయం తెల్లవారుజామున 26 వ డివిజన్ మాచవరం డౌన్ నందు, 25 వ డివిజన్ దుర్గాపురం సాంబమూర్తి రోడ్డు నందు, 4వ డివిజన్ గురునానక్ కాలనీ ప్రాంతములోని పలు వీధులలో పారిశుధ్యo మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ విధానమును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానము అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, సాంబమూర్తి రోడ్డులో చెత్తను వేసుకుని వెళ్తున్న క్లాప్ వెహికలును అపి పరిశిలించి తడి పొడి వ్యర్ధాలను వేరుచేస్తునరా? లేదా? అని అడిగితెలుసుకొని పలు సూచనలు ఇచ్చారు. నగరంలో క్లాప్ JSS ఆటో Tippers వేహికల్స్ నెల మొత్తంలో ఎంత చెత్త సేకరణ చేస్తున్నారో వాటి వివరాలు తెలుసుకొని, అదే విధముగా నగరపాలక సంస్థకు సంబంధించి ప్రభుత్వ నిభందనలకు అనుగుణంగా యూజర్ ఛార్జ్ లు సక్రమముగా వసూలు చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. ఆయా డివిజన్లలో ప్రతి రోజు చెత్త సేకరణకు మరియు డ్రెయిన్స్ ను శుభ్రపరచుటకు సిబ్బంది వస్తున్నది లేనిది అడిగితెలుసుకొని ఎవరునూ చెత్తను వీధులలో లేదా డ్రెయిన్ లలో పడవేయకుండా చెత్త సేకరణకు వచ్చు పారిశుధ్య సిబ్బందికు మాత్రమే అందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదే విధంగా డివిజన్ లలో ఇంటింటి చెత్త సేకరణ విధానమును మరియు డ్రెయిన్ నందు మురుగునీటి పారుదల తీరును పరిశీలించి అధికారులను పలు ఆదేశాలు ఇస్తూ, డ్రెయిన్ లలో నీటి పారుదలకు అడ్డంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించాలని, నూరు శాతం డోర్ టు డోర్ బాస్కెట్ కలెక్షన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖాధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *