-స్పందనలలో 18 అర్జీలను స్వీకరించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, నిర్వహించారు. ప్రజలు ఎదుర్కోను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్య పునరావృతం కాకుండా వేగవంతముగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా పట్టణ ప్రణాళిక – 8, ఇంజనీరింగ్ – 2, పబ్లిక్ హెల్త్ విభాగం – 2, యు.సి.డి – 2, రెవిన్యూ- 4 అర్జీలు వచ్చినవి.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, మేనేజర్ బి.శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News