Breaking News

మహా సూర్య యజ్ఞం పోస్టర్ ఆవిష్కరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రథసప్తమి సందర్భంగా జనవరి 27వ తేదీ సాయంత్రం3- 30 నిమిషాలకు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ నందు మహా సూర్య యజ్ఞం కార్యక్రమాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ IAS పోస్టర్ ఆవిష్కరించారు. కమిషనర్  దినేష్ మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థులకు ప్రణవ సంకల్ప యోగ సమితి వారి సహకారంతో మొదటి విడత ప్రాథమిక యోగ శిక్షణ కార్యక్రమం ముగిసింది అదేవిధంగా పిల్లలందరూ సూర్య నమస్కారాన్ని ప్రతి దినం పాటిస్తున్నారని తెలియజేయడానికి సంతోషంగా ఉంది సూర్య నమస్కార విశిష్టతను తెలియజేస్తూ రథసప్తమిని పురస్కరించుకొని ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ కి వస్తారని, అందరూ ఆహ్వానితులే అని తెలియజేశారు. యోగా గురువు పతంజలి శ్రీనివాస్ మాట్లాడుతూ మెరుగైన సాధన చేసిన విద్యార్థులు 108 రౌండ్లు సూర్య నమస్కారాలు ఈరోజు అనగా 23 వ తేదీ సాయంత్రం 4-30 నిమిషాల నుండి ఆనం కళా కేంద్రం ఆవరణలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పాల్గొన్న విద్యార్థులకు 27వ తేదీ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కమిషనర్ చే యోగ్యత పత్రాలను బహుకరించటం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె.సాంబశివరావు , మెడికల్ ఆఫిసర్ డా. వినూత్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శేషగిరిరావు ,సిటీ ప్లానర్ సూరజ్ కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వరహాల బాబు, సత్య సర్వేక్షన్ అధికారి అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *