Breaking News

పేదల సొంతింటి కల ముఖ్యమంత్రి నిజం చేస్తున్నారు !!

-మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన పేదలందరి సొంతింటి కలను గొప్ప లక్ష్యం నిబద్ధతతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నెరవేరుస్తున్నారని మాజీ మంత్రివర్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామంలో మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళ ‘ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలో 2,5,6 డివిజన్లకు సంబంధించి లబ్ధిదారులతో నూతనంగా నిర్మిస్తున్న -ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పేర్నినాని సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో నానా అగచాట్లు పడిన వారికి మాత్రమే స్థలం విలువ బాగా తెలుస్తుందని అన్నారు. కుటుంబ సభ్యులు ఎవరైనా కాలం చేస్తే, వారి భౌతికకాయాన్ని అద్దె ఇంట్లోకి అనుమతించని దౌర్భాగ్యం ఉందన్నారు. గృహ యజమాని కట్టడలను అద్దె కొన్నవారు పడిన మానసిక వేదన మాటల్లో వర్ణించలేనిదని అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుందన్నారు. వారి కనులకు సెంటు స్థలం ఎంతో గొప్పగా కనబడుతుందన్నారు. మచిలీపట్నం నియోజవర్గంలో పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు మెగా గ్రౌండింగ్‌ డ్రైవ్‌ను చేపట్టిందన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో కరగ్రహారంలో ఏ సెక్టార్ లో మొత్తం 757 ప్లాట్లలో సోమవారం 2,5,6 డివిజన్ల సచివాలయ పరిధిలో 105 మంది లబ్ధిదారులకు సంబంధించి ఇండ్లకు సామూహిక శంకుస్థాపనలు ఎంతో ఘనంగా జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో రూరల్ అర్బన్ తో కలిపి మొత్తం అర్హులైన పేద, మధ్య తరగతి ప్రజలైన 26 వేలమందికి ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ చేశామన్నారు.
ఇచ్చిన ఆ మాట ప్రకారం మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 16 వేలమంది ప్రజలకు, మచిలీపట్నం మండలంలో 34 గ్రామ పంచాయతీ పరిధిలో 4,600 మంది గ్రామీణ ప్రజలకు ఇంటి స్థలాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి దక్కుతుందన్నారు. ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి తిరిగి చెల్లించనవసరం లేని రూ.1.80 లక్షల ఆర్ధిక సహాయం చేయడం సామాన్య విషయం కాదన్నారు.
మచిలీపట్నంకు సమీపంగా ఈ లేఔట్లను ఏర్పరచడంలో ఒక మంచి ఉద్దేశం ఉందని, టౌన్ లో చిన్న ఉద్యోగాలు, ఉపాధి పనులు చేసుకునే వారికి సమీపంగా ఉండేలాగన కరగ్రహారంలో ఎకరం 39 లక్షలతో 319 ఎకరాలు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి నివేశన స్థలాలుగా రూపొందించడం జరిగిందన్నారు. అలాగే గిలకలదిండిలో వెయ్యి మంది నివేశన స్థలాల కోసం మరో 25 ఎకరాలు కొనుగోలు చేసి అదే ప్రాంతంలో వారికి ప్లాట్లను కేటాయించామన్నారు. బందరకోటలో నివసించే వారికి ఆ ప్రాంతంలోనే స్థలాలు కేటాయించామని, రైల్వే స్టేషన్ ప్రాంతంలో నివసించే వారికి అదే ప్రాంతంలో, ఉల్లింగిపాలెం, సర్కిల్ పేట, చింతగుంటపాలెం లోని ప్రజలకు వారికి సమీపంలోని ఇళ్ల స్థలాలు కేటాయించేయమన్నారు. శారదానగర్ లో నివసించే వారికి కాలే ఖాన్ పేటలో, దేశాయ పేటలో ప్రజలకు వారికి అత్యంత సమీపంలో నివేశన స్థలాలు చక్కని లేఔట్ ఏర్పరచి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 15,600 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు.
జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మించనుందన్నారు. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్‌ ట్యాంకును ఏర్పాటు చేయనున్నారన్నారు. ఈ కాలనీల్లో త్వరలో రహదారులు, నీటి కనెక్షన్లు విద్యుదీకరణ, డ్రైనేజీ వ్యవస్థ తదితర పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
వర్షాలు వచ్చేలోపు మిగిలిన లేఔట్ లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. కరగ్రహారం ఏ సెక్టార్ కు నవీన్ మిట్టల్ కాలనీ రోడ్డు నుంచి వచ్చే ఒక మార్గం, రాడారు సమీపంలోని విశ్వబ్రాహ్మణ కాలనీ నుంచి మరో 8 అడుగుల రోడ్డు కలసి 319 ఎకరాల లేఔట్ మధ్య నుంచి 80 అడుగుల రోడ్డు ఏ బ్లాక్ నుంచి చివరి వరకు కొనసాగుతుందన్నారు.
లబ్ధిదారులు గృహ నిర్మాణంపై పూర్తి శ్రద్ధ వహించి పనులు వేగవంతంగా చేయించాలని ఎమ్మెల్యే పేర్ని నాని కోరారు. ఇల్లు మన అభిరుచికి తగిన విధంగా నిర్మించుకోవాలని, అవకాశం ఉంటే, బంధుమిత్రుల సహకారంతో మరికొంత డబ్బు సేకరించి మరికొన్ని అదనపు సదుపాయాలు ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం 20 టన్నుల ఇసుక లబ్దిదారునికి ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. ఇంకా అవసరమైన స్టీలు, సిమెంటు గోదాములలో సిద్ధంగా ఉందన్నారు. గృహాలు నిర్మించుకోవడానికి ట్యాంకర్లతో నీళ్లు మచిలీపట్నం నగరపాలక సంస్థ సరఫరా చేస్తుందన్నారు. లబ్ధిదారులు రెండు డ్రమ్ములు ఏర్పాటు చేసుకుంటే ట్యాంకర్ మీ స్థలం వద్దకు వచ్చి నీటిని నింపుతుందన్నారు. వాటిని ఏమాత్రం వృధా చేయక కేవలం గృహ నిర్మాణం కోసం వినియోగించుకోవచ్చన్నారు
ఈ సామూహిక శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్‌ లంకా సూరిబాబు, మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, మచిలీపట్నం ఆర్డీవో ఐ కిషోర్, డిఆర్డిఏ పిడి, మెప్మా ఇన్చార్జి పిడి పిఎస్ఆర్ ప్రసాద్, తహశీల్ధార్‌ సునీల్‌ బాబు, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమీషనర్‌ చంద్రయ్య, 2వ డివిజన్ కార్పొరేటర్ పరింకాయల విజయ్ చందర్, 5వ డివిజన్ కార్పొరేటర్ వేముల గాంధీ, 6వ డివిజన్ కార్పొరేటర్ పర్ణం సతీష్, పలువురు అధికారులు, 50 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *