Breaking News

నూతన జిల్లాలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

-జిల్లా కలెక్టర్ మాధవీలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు
-ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలి
-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని , అందరం కలిసి విజయ వంతం చేద్దామని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో  జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుకలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, నూతనంగా జిల్లా ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపు కుంటున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ను ఆవిష్కరించి, జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వడం జరుగుతుందన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతం అవడంతో అందరం కలిసి పనిచేయాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల ద్వారా చేపట్టిన కార్యాక్రమాల పురోగతి పై వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమికంగా తొమ్మిది శాఖలకు చెందిన వాహన శకటాల ప్రదర్శన ఏర్పాటు చెయ్యడం పై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జనవరి 26 న జిల్లా స్థాయి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం లో తప్పనిసరిగా ప్రతి శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరు కావాలన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి ఎనిమిది స్కూల్స్ తరపున సాంస్కృతిక ప్రదర్శన లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మన జిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడంలో బాధ్యత తీసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు ప్రోటోకాల్, వివి ఐపి గ్యాలరీ, మీడియా గ్యాలరీ ల సిట్టింగ్ ఏర్పాట్లు, అల్పాహార, ప్రముఖులకు ఆహ్వానం వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లో అంతరాయం లేకుండా జెనరేటర్ ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని మాపక శాఖ ఫైర్ సేఫ్టీ భద్రత కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో అందరూ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

HNSS పనులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా…2027లోగా పూర్తి చేయాలని ఆదేశం

-2027 నాటికి HNSS శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులుపై కేబినెట్‌లో మంత్రి మండిపల్లిని అడిగిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *