Breaking News

అనాధబాలలు సామాజంలో ఉన్నత స్థానానికి ఎదిగేలా కృషి చేద్దాం.

-అనాధలను ఆదుకోవడానికి న్యాయవాధులు ముందుకురావడం అభినందనీయం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
అనాధబాలలను ఆధరించి విద్యాబోదనలను అందించడం ద్వారా సామాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని బాలలను ఆదుకునేందుకు న్యాయవాధులు స్వచ్చందగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గవర్నర్‌ పేటలో నిర్వహిస్తున్న బాల సదన్‌లో ఆశ్రయం పొందిన అనాధ బాలలకు విజయవాడ బార్‌ అసోసియేషన్‌ చెందిన న్యాయవాధుల సహకారంతో గ్రీజర్‌, వాషింగ్‌మిషన్‌, చాపలు, దుప్పట్లు, టవల్స్‌, దోమతెరలు, సోపు బాక్సులను శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అనాధ పిల్లలతో ముచ్చటిస్తూ మీకు అండగా మేమందరం వుంటాం. మీరు ఆరోగ్యంగా జీవించేందుకు, మంచి విద్యా బుద్దులు నేర్చుకునేందుకు ఎంతో మంది సహకరించేందుకు ముందుకువస్తున్నారన్నారు. చదువు పై శ్రద్ద పెటి ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడి స్పూర్తిదాయకంగా నిలవాలన్నారు. కొందరు తల్లిని కోల్పోయివారు మరి కొందరు తండ్రిని కోల్పోయి నిరాదరణకు గురి అయిన అనాధ పిల్లలకు బాల సదన్‌లో ఆశ్రయం కల్పించడం జరిగిందన్నారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ పిల్లల సంరక్షణ భాధ్యతలను నిర్వహిస్తుందన్నారు. పిల్లల పోషణ విద్యాబోదన వంటి విషయాలలో ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నప్పటికి స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో మెరుగైన సంరక్షణను అందించేందుకు అవకాశం వుంటుందన్నారు. బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు, మరి కొందరి దాతాల సహకారంతో బాల సదన్‌ నందు పెయింటింగ్స్‌ వేయించడం, వేడి నీటి సౌకర్యం కొరకు గ్రీజర్‌ బహుకరించడం, బట్టలు శుభ్రపరచుకునేందుకు వాషింగ్‌మిషన్‌లతో పాటు ఉపకరణాలను అందజేయడం అభినందనీయమన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటి సభ్యులు, సిబ్బంది, పిల్లల సంరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పిల్లల ఆరోగ్యా విషయాలను ఎప్పటికప్పడు గమనిస్తూ అవసరమైన పౌష్టికాహరాన్ని అందజేయాలని కలెక్టర్‌ సూచించారు.
కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. ఉమాదేవి, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటి సభ్యురాలు చంద్రగిరి రాధకుమారి, బాల సదన్‌ పర్యవేక్షకురాలు జోత్స్న, ఐసిపిఎస్‌ పివో రమ, బార్‌ అసోసియేషన్‌ మీడియ చైర్మన్‌ జె.కె. చక్రవర్తి, ఉపాధ్యాక్షులు పి. రవీంద్రబాబు, న్యాయవాదులు చందునాగరాజు, అనిత, ఉమామహేశ్వరరెడ్డి, టి. వీరేశ్వరలింగం తదితరలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *