Breaking News

గడపగడపతో సమస్యలకు సత్వర పరిష్కారం : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకంగా పాలన అందించడంతో పాటు, ఇంకా ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్న, సాంకేతిక కారణాల వలన సంక్షేమ పథకాలు అందకపోతే వారి సమస్యల పరిష్కారమే లక్ష్యం గా ప్రతి గడపకు వెళ్లాలని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రూపకల్పన చేసారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్, 283 సచివాలయం పరిధిలోని రాజరాజేశ్వరి గుడి రోడ్, దర్శిపేట, పూజిత అప్పార్మెంట్ ప్రాంతాల్లో నాయకులు, అధికారులు, వాలంటీర్లు తో కలిసి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి కుటుంబానికి లక్షల్లో లబ్ది చేకూరింది అని, కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని అన్నారు. అందుకే ప్రజలు అంతా సంతోషంగా మాకు ఎదురొచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కేవలం ప్రజలలో జగన్ గారికి పెరుగుతున్న ఆదరణ చూసి, వారి రాజకీయ మనుగడ కోసం మాత్రమే టీడీపీ వారు వారి అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకత అని అబద్ధపు ప్రచారాలు చేసుకొంటున్నారని విమర్శించారు. మీరెన్ని యాత్రలు చేసిన, ఎంత అసత్య ప్రచారాలు చేసిన ప్రజల మనసుల్లో ఈ ప్రభుత్వం చేసిన మంచి అనేది చిరస్థాయిగా నిలిచి ఉంటుందని రాబోయే ఎన్నికల్లో మరింత భారీ మెజారిటీతో వైసీపీ ఘన విజయం తధ్యమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో శెట్టికం దుర్గా, ఊకోటి రమేష్, నాసరయ, సిద్దయ్య, చిన్నయ్య, వెంకటేశ్వర రావు, బుజ్జి మరియు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తోపుడు బండి వితరణ
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు, ముఖ్యమంత్రి జగనన్న స్పూర్తితో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ నగర వ్యాప్తంగా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలుస్తున్నామని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం 14వ డివిజన్ కు చెందిన పోలూరి విజయ కు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 15వేల రూపాయల విలువ గల తోపుడు బండిని అవినాష్ అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *