Breaking News

ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-23 వ డివిజన్ 93 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేవని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సోమవారం 23 వ డివిజన్ 93 వ వార్డు సచివాలయం పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన పాల్గొన్నారు. కోవెలమూడి వారి వీధి, చలసాని వెంకటకృష్ణయ్య వీధి, రామానాయుడు వీధులలో విస్తృతంగా పర్యటించి 120 ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు స్థానికులు సాదర స్వాగతం పలికారు. పలువురు విదేశాల నుంచి తమ అభిమాన నేతతో వీడియో కాల్ ద్వారా సంభాషించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన గూర్చి కీర్తించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ప్రధాన రహదారుల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయడంతో ఈ ప్రాంత ముఖచిత్రమే మారిపోయిందన్నారు. మంచి నీటి సదుపాయాన్ని సైతం మెరుగుపర్చినట్లు వెల్లడించారు. ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీశారు. సైడ్ కాలువలలో ఎప్పటికప్పుడు పూడికను తొలగించాలని వీఎంసీ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు బకాయిలు పెట్టని శాఖ లేదు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రతిపక్ష పార్టీలన్నీ అబద్ధపు ప్రచారాలను నమ్ముకున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు పేర్కొన్నారు. కుప్పం వేదికగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని విమర్శించే ముందు.. విద్యా, వ్యవసాయ రంగాలకు చంద్రబాబు ఏం చేశారో లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ బకాయిల ట్రాక్ రికార్డు తమ వద్ద ఉందని.. చంద్రబాబు బకాయిలు పెట్టని డిపార్టుమెంట్‌ లేదని విమర్శించారు. చివరి రెండు సంవత్సరాల్లో ఫీజు రీయింబర్స్‌ మెంట్‌కు ఒక్క రూపాయి ఇవ్వకుండా.. పేద విద్యార్థులను చదువులకు దూరం చేసిన మీరు యువత గూర్చి మాట్లాడటం సిగ్గుచేటని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే రూ. 1,778 కోట్ల బకాయిలను క్లియర్ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే అన్నదాతలను సైతం గ‌త చంద్రబాబు ప్రభుత్వం ద‌గా చేసింద‌ని.. రుణమాఫీ సహా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచించింద‌ని మల్లాది విష్ణు ఆరోపించారు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని నమ్మించి.. చివరకు రూ. 15 వేల కోట్లతో సరిపెట్టారని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం రైతుల ముంగిటకే వ్యవసాయ పథకాలను తీసుకువచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా గత తెలుగుదేశం హయాంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు బకాయిలు పెట్టిన రూ.990 కోట్లను.. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టగానే చెల్లించడం జరిగిందన్నారు. కనుక రైతులకు మాయమాటలు చెప్పడం మానుకోవాలని నారాలోకేష్ కు సూచించారు. విద్యా, వ్యవసాయ రంగాలలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

మహాత్మునికి ఘన నివాళి
బాపూజీ కలలు కన్న సంపూర్ణ గ్రామ స్వరాజ్యం దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. జాతిపిత మ‌హాత్మా గాంధీ వర్థంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంత‌రం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శాంతి, అహింసా మార్గాలతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో అగ్రగణ్యులని కీర్తించారు. గాంధీ మహాత్ముడు సూచించిన అహింసా మార్గమే ఈ దేశానికి దిక్చూచి అని మల్లాది విష్ణు చెప్పారు. ఐక్యరాజ్య సమితి కూడా గాంధీజీ వర్థంతి రోజున ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తుచేశారు. బాపూజీ అడుగుజాడల్లో నడవడమే ఆ మహనీయునికి నేటి యువత అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు చల్లా సుధాకర్, వెన్నం రత్నారావు, కొల్లిపర శ్రీను, పసుమర్తి రాజేష్, ఆత్మకూరి వెంకట అప్పారావు, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *