-మంత్రి జోగి రమేష్
రాయవరం ( గూడూరు ), నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల వరకే పార్టీలని, ఎన్నికల తర్వాత అందరూ మన వాళ్ళే అన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం అని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వక్కాణించారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గూడూరు మండల పరిధిలో 15 క్లస్టర్లు, 881 ఇళ్ళు 2,700 మంది జనాభా గల రాయవరం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విస్తృతంగా పర్యటించారు.
తొలుత ఆయన నారగం లక్ష్మికుమారి, పామర్తి వాణి, మహమ్మద్ నూరిన్నీసా, సయ్యద్ సాబీరున్నిసా, పరసా వెంకటేశ్వరరావు, సయ్యద్ సమిమున్నీసా, కొనకళ్ళ దుర్గాభవాని, దుడుగు కోటమ్మ, కున్నెల్లి పరిమళాదేవి, గిద్దలూరి కృష్ణమూర్తి, ఆకురాతి వీరమ్మ, మునగాల రాధాకుమారి, షేక్ పీరాబి, మాచర్ల వెంకటసుబ్బమ్మ, కౌతువరపు మాణిక్యం, చెరుకు నాగదుర్గ మల్లేశ్వరి, నందం నాగమణి, సయ్యద్ అబ్బాస్, వీరంకి నారాయణమ్మ, బొల్లా కృష్ణకుమారి తదితరుల గృహాలను మంత్రి జోగి రమేష్ సందర్శించి అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ప్రజలు పొందిన లబ్ధి వివరాలతో కూడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. జగనన్న ప్రభుత్వం రావడం వలన మీకు ఇన్నిన్ని ప్రయోజనాలు చేకూరడం జరుగుతుందని అలానే పెడన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన పలువురు రాయవరం గ్రామస్తులతో మాట్లాడుతూ, మానవత్వం సంక్షేమం మెండుగా ఉన్న వైఎస్‌ఆర్సీపీ ఫిలాసఫీ ప్రకారం మేము ఎవరి కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు అసలే చూడం ప్రతి గడపకూ సంక్షేమ పాలన అందించడమే తమ ముఖ్య లక్ష్యం అని అన్నారు.
ప్రత్యర్థి పార్టీల ఇళ్ళకు సైతం వెళ్ళి ఎన్నో సంక్షేమ పథకాల లబ్ధిని వారికి సైతం ఎటువంటి వివక్షత లేకుండా చేకూరుస్తున్నామన్నారు జగనన్న నవరత్నాల పాలనకు అర్ధం గూర్చి మంత్రి వివరిస్తూ, ఇంటింటికీ గడప గడపకూ అందే సామాజిక న్యాయం ఇదేనన్నారు. ఇక సాధికారత విషయానికొస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు రకాల సాధికారతలు లక్ష్యంగా ఈ మూడున్నర ఏళ్ళలో విజయవంతంగా అడుగులు వేసిందన్నారు. ఇందులో మొదటిది ఆర్ధిక సాధికారతని, రెండోది రాజకీయ సాధికారత అని దీనికి అద్దం పట్టే విధంగా పదవులు, నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయిన్నారు.
మూడోది సామాజిక సాధికారత ఇందుకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎన్టీ, మైనార్టీ, పేదలే లక్ష్యంగా పథకాలు నేరుగా అందించబడ్డాయని తెలిపారు. అలాగే నాలుగోది మహిళా సాధికారత అని అన్నింటా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, మహిళలకు భద్రత, భరోసా అని మంత్రి జోగి రమేష్ అన్నారు.
ఐదోది విద్యా సాధికారత దాని ప్రకారం విద్య ద్వారానే అందరి జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల్లో పెను మార్పులు సంభవించడం గమనార్హం అన్నారు ఇందుకు ఎన్నో ఉదాహరణలు మన సమాజంలో ఉన్నాయని మంత్రి అన్నారు.ఈ విధానాలే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాయిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన గూర్చి జాతీయ మీడియా ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిలు, ఖురాన్‌లా అత్యంత పవిత్రంగా భావిస్తామని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెబుతూ ఉండేవారని ఆయన అధికారంలోకి వచ్చాక తూ.చ తప్పకుండా ఎన్నికల హామీలు అన్నింటిని ఆయన దిగ్విజయంగా అమలు చేస్తున్నారని వివరించారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు.. ఇప్పటికి 98.4 శాతం హామీలు అమలు చేశారని, దేశ రాజకీయాల్లోనే మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ అని చెప్పుకోవాలన్నారు. రాజకీయాల్లో అంకిత భావానికి, నిబద్ధతకు ప్రతిరూపంగా మన ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని మంత్రి జోగి రమేష్ కొనియాడారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాయవరం గ్రామ సర్పంచ్ నందం మల్లేశ్వరి రవికిరణ్, పిఎసిఎస్ అధ్యక్షులు కోళ్ల వీర వెంకట బాలకృష్ణ , వైఎస్ఆర్సిపి గూడూరు మండల ఉపాధ్యక్షులు కోళ్ల వీర వెంకట నాంచారయ్య, రాయవరం ఆర్బికే చైర్మన్ ఉప్పలపు రాఘవయ్య, గూడూరు ఎంపీపీ సంగా మధుసూదనరావు, జడ్పిటిసి వేముల సురేష్ రంగబాబు, వైస్ ఎంపీపీలు పిచ్చుక గంగాధర్ రావు, నేతల కుటుంబరావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, గూడూరు రైతు భరోసా కేంద్రం చైర్మన్ పర్ణం మహాలక్ష్మి నాయుడు ( పెదబాబు ) మండల పార్టీ అధ్యక్షులు గోరిపర్తి రవి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోటేపల్లి రత్నాకర రావు, వైస్సార్ సీపీ సీనియర్ నాయకులు తలుపుల వెంకటకృష్ణారావు, పిచ్చుక గంగాధర రావు, గూడూరు తహసిల్దార్ బి.విజయ ప్రసాద్, ఎంపీడీవో సుబ్బారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News