Breaking News

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు ఏపీ గవర్నరు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్నారు. రాజశ్యామలా అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాములను కలిసారు. రాజశ్యామలా అమ్మవారి దర్శనం కోసం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించడం ఇది రెండోసారని గవర్నరు గుర్తు చేసుకున్నారు. అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *