Breaking News

వైసీపీ ప్రభుత్వంలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సచివాలయ,వలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ 245వ సచివలయాల పరిధిలో చైత్ర స్కూల్ రోడ్,శాంతినగర్ ప్రాంతాల్లో నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాల లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే 98 శాతం పైగా హామీలను అమలు చేసిన ఘనత జగన్ గారిదే అని,మ్యానిఫెస్టోలో పెట్టని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు కొండంత భరోసా ఇస్తున్నారు అని తెలిపారు. తన సుదీర్ఘ పాదయాత్ర లో ప్రజల కష్టాలను స్వయంగా చూసి రూపొందించిన మెనిఫెస్టో ని పారదర్శకంగా అమలు చేయడమే లక్ష్యంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థ లను ప్రవేశపెట్టి గడప వద్దకే అర్హతే ప్రామాణికంగా సంక్షేమ లబ్ది అందజేస్తున్నారని అన్నారు.నేడు మా పర్యటనలో ప్రతి ఇంటికి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మేము జెండా మోసి కష్టపడిన సరే నాడు మాకు ఎలాంటి పధకాలు రాలేదు కానీ నేడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మా ఇంట్లో ముసలివాళ్ళకి పెన్షన్,అమ్మఒడి,చేయూత లాంటి పధకాలు వస్తున్నాయి అని చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. అర్హత ఉండి ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అమలు కాకపోతే మా ఈ పర్యటన లో అర్జీలు అందిస్తే సంబంధిత సచివాలయ సిబ్బంది తక్షణమే మంజూరు అయ్యేలా తగు చర్యలు తీసుకొంటారని భరోసా ఇచ్చారు. ఒకవైపు జనరంజక పరిపాలన అందిస్తూ జగన్ గారు ప్రజల మనసులో కొలువై ఉంటే,మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతలు సృష్టించి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే షో రాజకీయాలు, డ్రామాలు ఆడుతూ తన అనుకూల సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడానికే పరిమితం అయ్యారని,గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండటం లేదని ఎద్దేవా చేశారు.అందుకే వైస్సార్సీపీ నాయకులు వస్తుంటే ప్రజలు మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్, వైస్సార్సీపీ నాయకులు మరీదు ఉమ, చెక్క రోశయ్య,మహేష్, తిరుపతి, చిట్టిబాబు, సన్యాసి రావు, ప్రతాప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసహాయం అందజేత
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్,అంబెడ్కర్ నగర్ లో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు నిరుపేద కుటుంబానికి చెందిన గౌత్రు పాండు గారి కుమార్తె హాస్పిటల్ ఖర్చుల గురుంచి స్థానిక నాయకులు అవినాష్ దృష్టికి తీసుకురాగా శనివారం నాడు వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు నిమిత్తం 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *