Breaking News

ట్రాన్స్ఫార్మర్ ఆనుకొని శిలాఫలకం వేయడం అవసరమా?

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట్ మహేష్, ఈరోజు ఉదయం 53వ డివిజన్ లో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ ఆనుకొని శిలాఫలకం వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఈ ప్రాంతంలో లారీలు మినీ లారీలు తిరుగుతూ ఉంటాయని ట్రాన్స్ఫార్మర్ కు ఏదైనా రిపేర్లు చేయవలసి వస్తే శిలాఫలకం అడ్డంగా ఉందని ఈ శిలాఫలకం ఏర్పాటు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తన బినామీల ద్వారా మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయాన్ని మరియు అమ్మవారి దొడ్డిని తన బినామీల ద్వారా కుట్రపూరితంగా కొట్టేసి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలనుకున్నారని కానీ చిట్టి కాంగ్రెస్ పెద్దలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పటికే వెల్లంపల్లి ట్రస్ట్ పేరుతో అనేక ప్రభుత్వ భూములను కాజేసి తన ట్రస్ట్ లో కలిపేసుకున్నారని వాటిలో భాగంగానే పురావస్తు, ఇరిగేషన్, కార్పొరేషన్, కార్మిక శాఖకు చెందిన భూముల్ని కబ్జా చేశారని ఇప్పుడు మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయం వంతు వచ్చిందన్నారు. ఇక్కడ కావాలని శిలాఫలకం వేశారని రోడ్డు చివరు వేస్తే వారికి వచ్చే ఇబ్బందేంటో వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *