Breaking News

ఉద్యమంగా చెత్త సేకరణ

-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చేతుల మీదుగా ఇ-వేస్ట్ సేకరణ ప్రారంభం నెలరోజుల పాటు లయన్స్ క్లబ్ ల వద్ద సేకరణ
-లయన్స్ 316డి గవర్నర్ శ్రీశాంతి వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ ఇంటర్నేషనల్ విశేష సేవలు అందిస్తోందని 316డి జిల్లా గవర్నర్ దామర్ల శ్రీశాంతి పేర్కొన్నారు. అంధత్వ నివారణ, చిన్నపిల్లల క్యాన్సర్, మధుమేహం, ప్రత్యేక అవసరాలు గల వారికి సహాయం, యువతకు శిక్షణ, అన్నార్తుల ఆకలి తీర్చుట, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను లయన్స్ క్లబ్ నిర్వహిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా వ్యర్థపదార్థాల సేకరణ, రీ సైక్లింగ్ చేపట్టి పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని భావించామని ఆమె చెప్పారు. దీనిలో భాగంగా, ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు చేతుల మీదుగా ఫిబ్రవరి 7వ తేదీ ఉ దయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇ-వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు శ్రీశాంతి తెలిపారు. ఇళ్లలో వాడి పాడైపోయిన, నిరుపయోగంగా ఉన్న, పనికిరాని ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువులు, కంప్యూటర్, లాప్ టాప్, ప్రింటర్, ఫాక్స్, సెల్ ఫోన్, లాండ్ ఫోన్, ఛార్టర్, మైక్రోవేవ్, ఎలక్ట్రికల్ కుక్కర్, టీవీ, డివీడి, రిమోట్, స్టీరియో, టేప్ రికార్డర్, ఫాన్, హీటర్ లాంటి పరికరాల తయారీలో వాడే బెరీలియం, కాడ్మియం, మెర్యూరీ, సీసం వంటి మూలకాలు ప్రమాదకరంగా పరిణమించాయన్నారు. మానవాళికి పెనుముప్పుగా వున్న ఈ లోహాలు క్యాన్సర్ వంటి వాటికి కారణాలుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కృష్ణా, ఎన్.టి.ఆర్. జిల్లాలలోకు వందకు పైగా లయన్స్ క్లబ్ డి జిల్లాగా నిర్వహిస్తున్నామని, వీటి ద్వారా ఈ వేస్ట్ సేకరణ ఉ ద్యమం చేపడుతున్నామని శ్రీశాంతి వివరించారు. ప్రజలు ఈ-వేస్ట్ ను తమ పరిధిలోని లయన్స్ క్లబ్ లు , కేంద్రాలలో అందజేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని నెల రోజులపాటు ఉద్యమంగా నిర్వహిస్తామని, ప్రజలు సహకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *