
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు కుమారుడు ఎస్.జివితేష్ జాతీయ స్థాయి చేతివ్రాత పోటీలలో ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించారు. విద్యార్థులలో నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించేందుకు హ్యాండ్ రైటింగ్ ట్రైనర్స్, అమ్మఒడి హ్యండ్ రైటింగ్ అకాడమీ ఆలిండియా గ్రాఫాలజిస్ట్ సంస్థ ప్రతి మూడేళ్లకు ఒకసారి ఒలింపియాడ్ జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 4,112 ప్రైవేట్ పాఠశాలలు, 900 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఒకటి నుండి పదో తరగతి విద్యార్థులు సుమారు 30 లక్షల మంది అన్లైన్ ద్వారా హ్యాండ్ రైటింగ్ పోటీలకు హాజరైన్నట్లు హ్యాండ్ రైటింగ్ ట్రైనర్స్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ మెహబూబ్ హుస్సేన్ తెలిపారు. వీరిలో గత రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీలలో ప్రథమ స్థానం సాధించిన ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు కుమారుడు నలంద విద్యార్థి అయిన ఎస్. జివితేష్ జాతీయ స్థాయి పోటీలలో అత్యుతమ ప్రతిభ కనపరచి ఓవరాల్ చాంపియాన్ షిప్ను సాధించారని, హ్యాండ్ రైటింగ్ ట్రైనర్స్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ మెహబూబ్ హుస్సేన్ తెలిపారు. వీరితో పాటు ఏలూరు భాష్యం స్కూల్కు చెందిన ఆలపాటీ ప్రహర్షిక నేషనల్ ఎక్స్లెన్స్ హ్యాండ్ రైటింగ్ ఛాంపియాన్ షిప్ను, విజయవాడ ఫ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన అవ్యక్త ప్రద్యుమ్న పూజారి మిస్ ఇండియా బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఛాంపియన్ షిప్ను సాధించిన్నట్లు హుస్సేన్ తెలిపారు. విజేతలకు జాతీయ స్థాయి చేతివ్రాత నిపుణులు భువన చంద్ర శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఒలింపియాడ్ జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలలో ఓవరాల్ ఛాంపియాన్ షిప్ సాధించిన జివితేష్ను, ఆలపాటీ ప్రహర్షిక, అవ్యక్త ప్రద్యుమ్న పూజారిలను కుటుంబ సభ్యులు, పలువురు జిల్లా అధికారులు, విద్యా సంస్థల యాజమానులు అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News