-ఐసిడిఎస్ పిడి జి.ఉమాదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనాధబాలలను ఆధరించి విద్యాబోదన అందించేందుకు సహకరించేందుకు న్యాయవాధులు స్వచ్చందగా ముందుకు రావడం అభినందనీయమని జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి జి. ఉమాదేవి అన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గవర్నర్ పేటలో నిర్వహిస్తున్న బాల సదన్‌లో ఆశ్రయం పొందిన అనాధ బాలలకు శుక్రవారం విజయవాడ బార్ అసోసియేషన్ చెందిన న్యాయవాధుల సహకారంతో స్టిల్ మగ్గులు వాటర్ ఫ్లాస్క్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా పిడి జి. ఉమాదేవి మాట్లాడుతూ మీకు అండగా మేమందరం వుంటాం. మీరు ఆరోగ్యంగా జీవించేందుకు, మంచి విద్యా బుద్దులు నేర్చుకునేందుకు ఎంతో మంది సహకరింస్తామంటు బార్ అసోసియేషన్ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కొందరు తల్లిని కోల్పోయివారు మరి కొందరు తండ్రిని కోల్పోయి నిరాదరణకు గురైన అనాధ పిల్లలకు బాల సదన్‌లో ఆశ్రయం కల్పించడం జరిగిందన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పిల్లల సంరక్షణ భాధ్యతలను నిర్వహిస్తుందన్నారు. పిల్లల పోషణ విద్యాబోదన వంటి విషయాలలో ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నప్పటికి స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో మెరుగైన సంరక్షణను అందించేందుకు అవకాశం వుంటుందన్నారు. బార్ అసోసియేషన్ న్యాయవాదుల సహకారంతో బాల సదన్ నందు పెయింటింగ్స్ వేయించడం జరిగిందని వేడి నీటి సౌకర్యం కొరకు గ్రీజర్, బట్టలు శుభ్రపరచుకునేందుకు వాషింగ్మిషన్లు బహుకరించడం జరిగిందన్నారు. దాతాల సహకారంతో దుప్పట్లు దోమ తెరలు ఆటవస్తువులు పౌష్టికాహారం అందజేశారన్నారు. బాల సదన్‌లో చిన్నారులకు ఆరోగ్యా విషయాలను ఎప్పటికప్పడు గమనిస్తూ అవసరమైన పౌష్టికాహరాన్ని అందజేస్తూ పూర్తి పర్యవేక్షణ చేస్తున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటి మెంబర్ రాధకుమారిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటి సభ్యురాలు చంద్రగిరి రాధకుమారి, బాల సదన్ పర్యవేక్షకురాలు జోత్స్న, ఐసిపిఎస్ పివో రమ, ఉపకరణాలు అందించిన దాతలు బార్ అసోసియేషన్ సభ్యులు మల్లె మూడి సతీష్చ, కనిశెట్టి వెంకట రంగారావు, జి హరికృష్ణ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News