Breaking News

వివేక హత్యను అసలైన దోషులను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బొండా ఉమా  పిలుపు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కండ్రికలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో TNTUC రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ గొడ్డలివేటుతో చనిపోయిన వివేకానంద, హత్య చేసిన దుండగులను తప్పించడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. 40 కోట్ల రూపాయల సుఫారీ తో అత్యంత కిరాతకంగా బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దోషులను ఎందుకు పట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. బయట వ్యక్తులు ఎవరు వివేక ను హత్య చేసే అంత ధైర్యం ఎవరికీ లేదని అత్యంత దగ్గర మనుషులు సొంత మనుషులు వల్లనే ఈ హత్య జరిగింది అని అందరికీ అర్థమవుతుందని ఇది జగన్ కు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన హేళన చేశారు. వివేకానంద రెడ్డి హత్యలో వేళ్ళని తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని సిబీఐ అధికారులు విచారణ వేగవంతం చేయడంతో ఒక్కొక్కటిగా నిజాలు బయటికి రావడంతో జగన్ రెడ్డికి ఏం చేయాలో పాలు పోవటం లేదని తమ్ముడు అవినాష్ రెడ్డిని ఏ విధంగా కాపాడాలో అర్థం కావట్లేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వివేకానంద హత్య దోషులను పట్టుకోవడానికి చర్యలను వేగవంతం చేయాలని అసలైన దోషులను పట్టుకోవాలని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర చేస్తుంటే వైసీపీ నాయకులకు వెన్నులో వణుకు మొదలైంది అని అన్నారు. లోకేష్ అంటే భయపడుతున్నారు కాబట్టే అడుగడుగునా ఆటంకాలు సృష్టింస్తున్నారు. మీరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా యువగళం ఆగదు అని అన్నారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాసరి కనకారావు,TNTUC రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాలా మాధవ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *