Breaking News

అంగన్వాడీల పై చిన్న చూపు చూస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అంగన్వాడీ మీడియా కో ఆర్డినేటర్ బొప్పన నీరజ మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలపై ఎక్కడా లేని ప్రేమను చూపించి, అధికారంలోకి రాగానే మీ జీవితాలు బాగు చేస్తానని హామీ ఇచ్చి, గద్దెనెక్కిన తర్వాత అంగన్వాడీలను నట్టేట మోసం చేశాడు అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీలకు 4200 నుంచి 10,500 రూపాయలు జీతం పెంచితే, ఆ జీతం డబ్బులు కూడా సరైన సమయానికి ఇవ్వలేని పరిస్థితిలో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు.అంగన్వాడీల కు గత నాలుగు నెలలుగా జీతాలు లేని పరిస్థితి ఉందన్నారు. చిన్నపిల్లలకు ఇచ్చే పోషకాహారంలో కూడా కక్కుర్తి పడి చిక్కి, పాలు, గుడ్డు కూడా సరిగ్గా ఇవ్వలేని జగన్ రెడ్డి ప్రభుత్వం పాడైపోయిన ఆహారం పిల్లలకి ఇచ్చి వారి ఆరోగ్యం తో ఆట్లాడుతుందన్నారు. అధికారుల వేధింపులు పడలేక రాజమండ్రిలో ఒక అంగన్వాడి వర్కర్ ఆత్మహత్య చేసుకుందన్నారు. డ్వాక్రా రుణమాఫీ మూడో విడత సెప్టెంబర్ లో చేయాల్సిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదని విమర్శించారు. డ్వాక్రా మహిళలు దాచుకున్న సొమ్మును కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కాజేసింది అన్నారు. రానున్న రోజుల్లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి అంగన్వాడీలు తగిన బుద్ధి చెప్తారు అని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *