విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడి నుండి చిన అవుటుపల్లి జాతీయ రహదారి విజయవాడ బైపాస్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తీ చేయాలనీ జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అధికారులను ఆదేశించారు. గొల్లపూడి నుండి చిన అవుటుపల్లి జాతీయ రహదారి -16 నిర్మాణం లో భాగంగా విజయవాడ రూరల్ బైపాస్ నందు నున్న , కే. వి కండ్రిక, పాతపాడు, పి . నైనవరం, అంబాపురం, జక్కంపూడి మరియు గొల్లపూడి గ్రామాలలో మంగళవారం జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డిఆర్వో కె. మోహన్ కుమార్, రూరల్ తహశీల్ధార్ జాహ్నవి, జాతీయ రహదార్ల ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణ, సాంకేతిక నిపుణులతో పర్యటించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదార్లు విజయవాడ నగరం గుండా వెళ్ళటంతో నిత్యం ట్రాఫిక్ రద్దీతో నగరవాసులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. దీనిలో భాగంగా నగరం వెలుపల నుండి జాతీయ రహదార్ల విస్తరించడం వల్ల ట్రాఫిక్ రద్దీని నివారించవచ్చునన్నారు. జాతీయ రహదారి -16 గొల్లపూడి నుండి చిన అవుటుపల్లి వరకు నిర్మాణంలో భాగంగా సర్వీస్ రోడ్డు, సరిహద్దు గోడల నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అధికారులను ఆదేశించారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News