Breaking News

రాష్ట్రంలో పెట్టుబడి దారులు పెట్టుబడి పెట్టె స్థితిలో ఉన్నారా?

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు గురువారం నాడు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఎందరో మహానుభావులు స్థాపించిన ఎన్నో సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తుంటే ఒక్కరు కూడా ఆంద్రప్రదేశ్ కి తమ కంపెనీ చిరునామా మార్చటానికి ఇష్టపడకపోవటానికి కారణం మనము పట్టించుకోవటం లేదా ఇంకా ఏమైనా ఇబ్బందులు పెట్టడం వల్ల రావటానికి భయపడుతున్నారా అన్న అంశం మీద విస్తృత స్థాయిలో రాష్ట్రము లో చర్చ జరగాలి అన్నారు. ఉద్యోగాలు ఉపాధి లేక తీవ్ర వలసలతో సతమతమవుతున్న రాష్ట్రానికి పారిశ్రామిక విధానం ప్రాణవాయులాంటిది అలాంటి పారిశ్రామిక విధానం ఉన్నతంగా ఉన్నదా లేక కక్ష్య తో నిండిన రాజకీయ వ్యవస్థ పారిశ్రామిక విధానాన్ని చంపేసినదా అన్న అనుమానం రావటం లేదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నామన్నారు. పారిశ్రామిక సదస్సులు పెడుతున్నాము కంపెనీలను పిలుస్తున్నాము అని చెప్పే మీరు మీ మీ కుటుంబం, నాయకు లు అలాగే అనుబంధ కంపెనీ అడ్రస్ లు ఎందుకు హైదరాబాద్ లో నే ఉన్నాయి? అని ప్రశ్నించారు. మీ పాన్ కార్డు మీ కంపెనీలు హైదరాబాద్ లో ఉంటె మీరేమో పెట్టుబడి దారులను ఆహ్వానిస్తున్నాము లాంటి మాటలు ఎవరి చెవులో పువ్వులు పెట్టడానికి అన్న సందేహం రావటం లేదా అని ఏద్దేవ చేశారు.
ఆంధ్రప్రదేశ్ మూలాలున్న దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఆయా కంపెనీల అడ్రెసుని ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు మార్చటానికి ఇష్టపడటం లేదు అన్న చర్చ
గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు తిరగ దోడటం ముఖ్యంగా మూడురాజధానుల విధానం అప్పటి వరకు అమరావతి లో పెట్టుబడి పెట్టిన లాంటి సంస్థలు తీవ్ర నష్టపోవటం రైతుల ఒప్పందాలను తుంగలో తొక్కటం లాంటి చర్యలు,అలాగే రివర్స్ టెండరింగ్ లాంటి విధానాలు,రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలను బయపెట్టడాలు,అమర్ రాజా లాంటి సంస్థలను మూసేయమని ఆదేశించటం లాంటి కక్ష్యపూరిత నిర్ణయాలు రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని పెట్టుబడి దారుల నమ్మకాన్ని బాగా దెబ్బతీశాయను కోవచ్చు అన్నారు. సుమారు 2.4 లక్షల కోట్ల బడ్జెట్ లో కనీసం 2080 కోట్లు కూడా నిధులు కేటాయించని రాష్ట్రానికి ఏమిచూసి పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు, ఏమి రాయితీలు ప్రభుత్వం ఇవ్వగలదు, అలాగే ప్రకటించిన రాయితీలు ఏ విధంగా నెరవేర్చగలదు అన్న అనుమానం పెట్టుబడి దారులకు రాదా? అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టర్ లకు దీర్ఘకాలిక బిల్లుల పెండింగ్ అలాగే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఆర్థిక దివాళా పరిస్థితులున్న రాష్ట్రానికి పెట్టుబడి దారులు ఏ నమ్మకంతో పెట్టుబడి పెడుతారు అని ప్రభుత్వాలు ఆలోచించాలిసిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విధానాలను సమీక్షించుకుని పారిశ్రామిక విధానాన్ని రూపొందించటం అలాగే ముందుగా అధికార ప్రతిపక్షాల నాయకులు ముందు మీ కంపెనీ అడ్రెసులు ఆంధ్రప్రదేశ్ కి మార్చాలి అని కోరారు. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న పారిశ్రామిక వేత్తలకు అవసరమైన రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానంలో మార్పులు ఉండవు అలాగే పెట్టుబడి దారుడు ఎప్పుడు పెట్టుబడి దారుడేగాని అతనికి కులం మతం ప్రాంతంతో సంబంధం లేదు అన్న విధంగా పారిశ్రామిక విధానం తీసుకొని వస్తే రాష్ట్రము అభివృద్ధి చెందుతుందనీ పేర్కొన్నారు. ముఠా గొడవలతో రాజకీయ వ్యవస్థ ఉంటె ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు లేకుండా చేసిన వాళ్లుగా చరిత్రలో మిగిలిపోతారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ సెక్రెటరీ బొప్పన రాజశేఖరరావు, సహాయ సెక్రెటరీ పావులూరి ఖాజారావు, నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం, నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *