Breaking News

పరిశోధన, పరిశీలన, అవగాహన ఉంటేనే ఆవిష్కరణలు సాధ్యం !!

-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
-నీటి పారుద‌ల’ ప‌నుల పురోగ‌తిపై క‌లెక్ట‌ర్ స‌మీక్ష
-ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశాలు జారీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశోధన, పరిశీలన, అవగాహన ఉంటేనే నూతన ఆవిష్కరణలు సృష్టించాలని ఆలోచనలు కలుగుతాయని, నీటిపారుదల శాఖలో విద్యాధికులైన ఇంజనీర్లు ఆ దిశలో యోచించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పిలుపునిచ్చారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని స్పందన సమావేశం మందిరంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో నీటిపారుదల శాఖలో మిగిలిన నిర్వహణ పనులు గూర్చి వాకబు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నో సామాజిక సమస్యలకు విన్నూత్నమైన పరిష్కారాలను చూపించే సృజనాత్మకతను ఈ తరం ఇంజనీర్లు కనబరచాలని, ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో పాతకాలం పద్ధతులే నేటికీ కొనసాగుతున్నాయన్నారు. నేడు ఉన్న ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ప్రభుత్వానికి అనవసర వ్యయాన్ని నివారించాలని అందుకు అవసరమైన వైవిధ్యమైన విధానాన్ని అన్వేషించాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లాలో రిజిస్టర్ కాబడిన ఆయకట్ 586692.9 ఎకరాలు ఉందని ఇందులో ధాన్యం పండే భూమి 486070.7 ఎకరాలు కాగా, చెరుకు పండే భూమి 1172.5 ఎకరాలు, అలాగే ఆక్వా సాగు చేసే 97832.0 ఎకరాల భూమి ఉందని చెబుతూ, కె ఈ డివిజన్ పరిధిలో ఉప్పులూరు, ఆత్కూరు, అప్పర్ పామర్రు, లోయర్ గుడివాడ, జొన్నపాడు, వెంట్రప్రగడ, కౌతవరం, గుడ్లవల్లేరు, కృత్తివెన్ను, బంటుమిల్లి సెక్షన్ల అసిస్టెంట్ ఇంజనీర్లను ఆయా పరిధిలోని పనుల పురోగతిని కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు, అదేవిధంగా డ్రైనేజీ కు సంబంధించి 44 పనులను సబ్ డివిజన్ వారీగా డీల్ ని అడిగి తెలుసుకున్నారు. బుడమేరు పనులలో పురోగతి లేకపోవడంపై సంబంధిత డి ఈ ని కలెక్టర్ ప్రశ్నించారు. కైకలూరు మచిలీపట్నం కేసి డివిజన్ దివి సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న పనులపై సంబంధిత ఇంజనీర్లను వివరాలు పురోగతి పై సమీక్షించారు. జిల్లాలో నీటిపారుదల శాఖకు సంబంధించిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, అందుకు సంబంధిత‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని ఎస్ ఈ తిరుమలరావుకు సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ ఈ తిరుమల రావు డి ఈ శ్రీనివాస్, కేఈ డివిజన్ ఎస్ఈ కె. బాబు, పలు డివిజన్ల ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *