Breaking News

హౌసింగ్ లే ఔట్ ల భూ పరిహారం, లెవలింగ్ బిల్లుల చెల్లింపు పూర్తి చేయండి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గృహనిర్మాణాల లే ఔట్ లకు సంబంధించి భూసేకరణ పరిహారంతో పాటు, చదును చేపట్టిన పెండింగ్ బిల్లుల చెల్లింపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం జెసి డి.కె.బాలాజీతో కలసి హౌసింగ్ , తిరుపతి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ అధికారులతో , తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ అధికారులు లే ఔట్ లలో గతంలో చేపట్టిన లెవెలింగ్ బిల్లులు పెండింగ్ లేకుండా త్వరగా చెల్లించాలని సూచించారు. జిల్లాలో గృహనిర్మాణాలకు చేపట్టిన భూ సేకరణ బిల్లులు కూడా మరోమారు పరిశీలించి చెల్లింపుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పాగాలి, శ్రీనివాసపురం, అగరాల, చిందే పల్లి , దుర్గ సముద్రం , నీర్పాకోట లే ఔట్ల పై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ , హౌసింగ్ అధికారులు సంయుక్తంగా సత్వర చర్యలు చేపట్టి చెల్లింపులు చేపట్టాలని అన్నారు. ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, తిరుపతి , శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారులు కనకనరసా రెడ్డి, రామారావు, హౌసింగ్ పి డి వెంకటేశ్వర్లు , హౌసింగ్ ఇంజనీర్లు ,తహసిల్దార్లు , హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *