Breaking News

విన్ ప్రో లైఫ్ కార్యాలయం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు నందు వి న్ ప్రో లైఫ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డి. యశ్వంత్ మాట్లాడుతూ విన్ ప్రో లైఫ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రానున్న కాలంలో మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యమైన మరియు నాణ్యమైన వస్తువులను అతి తక్కువ ధరలకు అందించే ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటికే దక్షిణ భారతదేశం నుండి దాదాపు పదివేల కుటుంబాలు తమ సంస్థతో బంధాన్ని ఏర్పరచుకొని తమ సేవలను పొందేందుకు సంసిద్ధముగా ఉన్నారని తెలిపారు. సంస్థ డైరెక్టర్ జి. వెంకటేష్ మాట్లాడుతూ తమ సంస్థ నిర్వహించబోయే డైరెక్ట్ సెల్లింగ్ మరియు మార్కెటింగ్ వ్యాపారం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వస్తువులతో పాటు యువతీ యువకులకు మరియు గృహిణులకు ఆదాయం పొందే అవకాశాన్ని తమ సంస్థ అందిస్తుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఎం సత్యమూర్తి ,సంస్థ లీగల్ అడ్వైజర్ కృష్ణ వైట్ల, సంస్థ ఆడిటర్ సుబ్రహ్మణ్యం, బ్రాంచ్ మేనేజర్ జి. సంధ్యారాణి మరియు క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *