Breaking News

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్రనికి పెట్టుబడుల వెల్లువ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంస్కరణలు, ఇస్తున్న రాయితీలతో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 18వ డివిజన్,83,84 సచివాలయల పరిధిలోని అంథోని స్ట్రీట్ నందు మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి అవినాష్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలు అందరూ కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, చేసున్న అభివృద్ధి పట్ల వారి సంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ఈ డివిజన్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే దాదాపు 12కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటింటికి మంచినీటి కుళాయిల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంస్కరణలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ వ్యాపార సంస్థలు అన్ని కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని, మన వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. గతంలో లాగా ఉత్తుత్తి ఒప్పందాలు, ఆర్భాట ప్రచారాలు లేకుండా నేరుగా దిగ్గజ సంస్థలే పరిశ్రమల ఏర్పాటు కు ముందుకు రావడం శుభపరిణామం అని, మన యువతకు అన్నివిధాలా మేలు జరుగుతుంది అని అవినాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్,18వ డివిజన్ కార్పొరేటర్,వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *