Breaking News

అగ్ని కుల క్షత్రియ కార్యవర్గ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్నికుల క్షత్రియ కార్యవర్గ సమావేశం జాతీయ అధ్యక్షులు నాగిడి సాంబశివరావు ఆధ్వర్యంలో విజయవాడ, ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో నాగిడి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నెల్లూరులోని తడ నుండి శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు దాదాపు 40 లక్షల మంది ఉన్న అగ్నికులక్షత్రియ కార్పొరేషన్‌ నిధులు ప్రకటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నికులక్షత్రియులను గుర్తించి గతంలోని టిడిపి ప్రభుత్వం, కాంగ్రెస్‌ ప్రభుత్వలు మంత్రి పదవులు ఇచ్చారని నేడు వైసిపి ప్రభుత్వం మంత్రి పదవికేటాయించలేదని, ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాలలో చిన్న చిన్న కులాలకు రెండు రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించి అతి పెద్ద బిసి కులం అయిన అగ్నికులక్షత్రియ కులానికి ఒక్కటి కూడా కేటాయించకుండా అన్యాయం చేశారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎమ్మెల్సీ హామీ ఇచ్చి అగ్ని, వన్నియ కులక్షత్రియ కార్పొరేషన్స్‌కి 5000 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో లక్ష మందితో అగ్నికులక్షత్రియ మహాగర్జన నిర్వహించి తమ సత్తా చాటుతాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చింతా రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాడి రామకృష్ణ అన్ని జిల్లాల అద్యక్షులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *