విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజీవ్ గాంధీ పార్కు నందలి మిగిలిన అభివృద్ధి పనుల యొక్క పురోగతిని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ సంబందిత అధికారులతో కలసి పర్యవేక్షించి పార్కు ఎంట్రన్స్ లో ఉన్న టికెట్ కౌంటర్ నందు పరిశీలించి సంబందిత అధికారులకు పలు ఆదేశాలు జారిచేసినారు. పార్క్ ఆవరణలో మిగిలిపోయిన చిన్న చిన్న పనులను వేగవంతముగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా పార్క్ ఆవరణలో గల పనికిరాని స్క్రాబ్ మరియు మట్టి కుప్పలను తొలగించాలని సంబందిత అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, పార్క్ సూపర్ వైజర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News