Breaking News

పలు సమస్యలపై అధికారులతో సమీక్ష….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.తో కలిసి డివిజన్ల పరిధిలో ప్రజలు ఎదుర్కోను పలు సమస్యలపై అధికారులతో కలసి సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లకు సంబంధించి చేపట్టవలసిన అభివృద్ధి పనుల వివరాలు మరియు ప్రజలకు ఎదురౌతున్న పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సందర్బంలో డివిజన్లలో టెండర్లు ఆమోదించిన పనులను వెంటనే ప్రారంభించవలసినదిగాను నిర్మాణంలో ఉన్న పనులు వేగవంతము చేసి పూర్తి చేయునట్లుగా చూడాలని కోరారు. డ్రెయిన్లు, త్రాగు నీటి సరఫరా, వీది దీపాల నిర్వహణ వంటి పలు సమస్యలను తక్షణమే పరిష్కారించునట్లుగా చూడాలని అన్నారు. ఈ సందర్బంలో గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా క్షేత్ర స్థాయిలో డివిజన్లలో పర్యటించిన నేపధ్యంలో ప్రధానంగా రోడ్లు, డ్రెయిన్లు, త్రాగు నీటి సరఫరా, కొండ ప్రాంతాలలో మెట్ల మార్గం వంటి పలు ప్రధాన సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని శాసన సభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ గారికి వివరించారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ఎదురౌతున్న ఇబ్బందులకు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమము లో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు, నారాయణ మూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ బాబు మరియు ఇతర విభాగముల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *