Breaking News

ఎక్సెల్ ప్లాంట్ల నందు చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందు జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పనుల యొక్క పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్లాంట్ ఆవరణలో మిగిలిపోయిన సి.సి.రోడ్లను వేయాలని, Cal-on ఇండస్ట్రీస్ వారి నిర్వహణలో గల టోల్ గేటు మాదిరిగా ఏర్పాటు చేసిన చెత్త వేయింగ్ (వే బ్రిడ్జి) పని తీరును పర్యవేక్షించి పలు సూచనలు చేసారు. ప్లాంట్ నందు రోజుకు ఎన్ని చెత్త వాహనములు వస్తున్నాయో వాటి గురించి వివరములు అడిగి తెలుసుకుని, కంప్యుటర్ రూమ్ ని పర్యవేక్షించి పలు సూచనలు చేసారు. ప్లాంట్ నందు చెత్త వాహనములు పార్కింగ్ చేయు ప్రదేశములో కొంత మేర చెత్త ఉండుట గమనించి పూర్తి స్థాయిలో చెత్తను తొలగించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉండునట్లుగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్లాంట్ ఆవరణలో ప్రవేశ ద్వారమును నుండి వేబ్రిడ్జి వరకు వేసిన BT రోడ్ల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. మిగిలిన పనులను త్వరతగతిన పూర్తి చేయాలనీ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. అదే విధంగా ఎక్సెల్ ప్లాంట్ కు ఎదురుగా అభివృద్ధి చేస్తున్న ఐకానిక్ పార్కులో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి,ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ సత్యనారాయణ రావు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *