Breaking News

టెర్రస్‌ గార్డెన్స్‌లను ప్రోత్సహించి నగరాన్ని గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దుదాం..

-గ్రీన్‌ షెడ్‌ (టెర్రస్‌ గార్డెన్‌)ను నిర్వహుకులకు ప్రోత్సహాలను అందిస్తాం..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టెర్రస్‌ గార్డెన్‌లను ప్రోత్సహించి నగరాన్ని గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దడంతోపాటు సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉందని,గ్రీన్‌ షెడ్‌ (టెర్రస్‌ గార్డెన్‌)ను నిర్వహుకులకు ప్రభుత్వ పరంగా ప్రోత్సహకాలను అందిస్తామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. నగరానికి చెందిన టెర్రస్‌ గార్డెన్స్‌ నిర్వహుకులతో మంగళవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆయన కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నందు సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం వినియోగిస్తున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండిరచడంలో రైతులు అవసరాలకు మించి ఎరువులు పురుగుమందులతో పాటు మార్కెట్‌లో నిల్వ ఉండేందుకు రసాయనాలను వినియోగించడం వల్ల ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. ఎవరికివారు కనీసం వారి కుటుంబ అవసరాలకు సరిపడ కూరగాయలు ఆకుకూరలను స్వయంగా పండిరచి వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వయంగా పండిరచి తినడంలో తృప్తి, ఆనందం చెప్పనలవి కాదన్నారు. ప్రతి ఒక్కరిలో పండిరచు పంచు అనే భావం ఉండాలన్నారు. ఇప్పటికే నగరంలో వందలాదిమంది వారి గృహాల టెర్రస్‌లపై సేంద్రీయ పద్దతిలో కూరగాయలు, ఆకుకూరలు పండ్లు పండిస్తూ ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌ (సిటిజి) పేరుతో టెర్రస్‌ గార్డెన్స్‌ నిర్వహుకులు ఒకే వేదికపైకి వచ్చి గార్డెన్‌ నిర్వహణలో లోటుపాట్ల పై చర్చిచుకోవడం అభినందనీయమన్నారు. వీరిని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ టెర్రస్‌ గార్డెన్‌ నిర్వహణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టెర్రస్‌ గార్డెన్‌ నిర్వహించేవారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సహకాలను అందిస్తామన్నారు. సిటీ ఆఫ్‌ టెర్రస్‌ గార్డెన్స్‌ (సిటిజి) సభ్యులకు చేయూతనిచ్చే చర్యలలో భాగంగా అర్భన్‌ ఫార్మింగ్‌ పై ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిస్తామన్నారు. వర్మి కంపోస్టు, పోస్టు హర్వేస్ట్‌ టెక్నాలజిని, ట్రైకోడెర్మో, వంటి హాని తలపెట్టని ఫంగస్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్వహుకులు విత్తనాలను శుద్ది చేసుకుని నాటేలా విత్తన శుద్దిపై అవగాహన కల్పింస్తామన్నారు.టెర్రస్‌ గార్డెన్‌ సభ్యులు సమావేశాలను నిర్వహించుకునేందుకు నగరంలోని వ్యవసాయ అధికారుల సంఘం భవన సమావేశ మందిరం, పింగళి వెంకయ్య సమావేశం మందిరం ఉచితంగా కేటాయిస్తామన్నారు. ఉద్యాన శాఖ అధికారులు టెర్రస్‌ గార్డెన్‌ నిర్వహులకు అవసరమైన సహాయ సహకారలు అందించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. టెర్రస్‌ గార్డెన్‌ ద్వారా పండిరచిన కూరగాయలు, ఆకుకూరలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ఐసిడిఎస్‌ పిడిని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు.
సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి. బాలాజీ కుమార్‌, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, సిడిపివో మంగమ్మ, జిల్లా మెక్రో ఇరిగేషన్‌ ఆఫీసర్‌ సుభాణి, టెర్రస్‌ గార్డెన్‌నిర్వహుకులు డి. నాగలక్ష్మి, పి శ్రీనివాస్‌, ఇ. లీలా కుమారి, ఎ. సురేష్‌, దాసరి శ్రీదేవి, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *