Breaking News

సామూహిక పార్థీనియం మొక్కల నిర్మూలలో భాగస్వామ్యం కావాలి..

-డ్వామా పిడి జె. సునీత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సామూహిక పార్థీనియం (వయ్యారి భామ) మొక్కల నిర్మూలన కార్యక్రమంలో జిల్లాకు చెందిన వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు సిబ్బంది పంచాయితీరాజ్‌, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల సిబ్బంది భాగస్వామ్యులై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డ్వామా పిడి జె. సునీత కోరారు.
మండల అభివృద్ధి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మండల వ్యవసాయ అధికారులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక బృందాల సభ్యులు, గ్రామ సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పారిశుద్ద్యకార్మికులు వారి పరిధిలో పార్థీనియం (వయ్యారి భామ) కలుపు మొక్కల నిర్మూలన కార్యక్రమంలో పాల్గొని పార్థీనియం మొక్కలను గుర్తించి వాటిని కూకటి వేళ్ళతో పెకిలించి రెండు రోజుల బహీరంగ ప్రదేశాలలో ఎండబెట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని దగ్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాన్ని బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నున్న గ్రామంలో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించనున్నారని ఆమె తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *