విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఏపీఐఐసీ కాలనీ లో ఉన్న మసీదు ను భవిష్యత్తు లో రోడ్డు విస్తరణ లో భాగంగా తొలగిస్తే అందుకు ప్రత్యామ్నాయంగా మున్సిపల్ కార్పోరేషన్ స్థలాన్ని మంజూరు చేసి మసీదు నిర్మాణానికి తగు సహాయసహకారాలు అందిస్తామని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మసీదు కమిటీ వారికి భరోసా ఇచ్చారు. బుధవారం చీఫ్ సిటీ ప్లానర్ ప్రసాద్, కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆ మసీదు ను సందర్శించిన అవినాష్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మసీదు కమిటీ సభ్యులు ఇటీవల తనని కలిసి ఒకవేళ రోడ్ విస్తరణ లో భాగంగా మసీదు తొలగిస్తే మాకు అంగీకరమే అని, కానీ ముస్లిం ప్రజలు నమాజు చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లగా నేడు అధికారులు వచ్చి స్థల పరిశీలిన చేసి ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు అని అన్నారు. ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అవినాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ ప్రసాద్,ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షులు,కృష్ణా జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్ మీర్ హుస్సేన్,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని బాబీ, కో ఆప్షన్ మెంబెర్ అలీమ్,మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News