Breaking News

వైఎస్సార్ ఆసరా నిధులను సద్వినియోగం చేసుకోవాలి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మహిళల్లో ఆర్థిక చైతన్యం వస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్లోని జింఖానా గ్రౌండ్ నందు శుక్రవారం జరిగిన వైఎస్సార్ ఆసరా మూడో విడత ఉత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డప్పు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం జగనన్న ప్రతి పథకాన్ని అక్కచెల్లెమ్మల పేరిటే అందిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసిన స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం జవసత్వాలిస్తోందని పేర్కొన్నారు. మూడో విడత ఆసరా ద్వారా డివిజన్ లోని 112 గ్రూపులలో రూ. కోటి 14 లక్షల 8 వేల 677 రూపాయల నిధులు జమ చేసినట్లు తెలిపారు. అత్యధికంగా దుర్గాదేవి పొదుపు సంఘానికి రూ. 2 లక్షల 42 వేల 971 రూపాయలు రుణమాఫీ జరిగినట్లు చెప్పారు. ఇంత ఠంచనుగా చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని ఎమ్మెల్యే తెలిపారు.

ఆడపడుచుల పేరిట ఇంటి పట్టాలు
పేదల సొంతింటి కలను ఆసరాగా తీసుకుని గత పాలకులు, జన్మభూమి కమిటీలు పేదలను నిలువునా మోసగించాయని మల్లాది విష్ణు ఆరోపించారు. కనీసం స్థలాలు కూడా లేకుండా టిడ్కో ఇళ్ల పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. కేవలం కాగితాలకే ఇళ్లను చూపి.. ఒక్కో లబ్ధిదారుని వద్ద రూ. 50 నుంచి రూ. లక్ష వరకు అప్లికేషన్ల రూపంలో దోచుకున్నారన్నారు. ఇందులో 6,576 ఇళ్లు 50 శాతం కూడా పూర్తికాలేదని.. 5,341 మందికి కనీసం స్థలం కూడా చూపలేదన్నారు. అయినా కూడా నగరంలో 11,917 మందికి ఆర్డర్ కాపీలను ఇచ్చారని దుయ్యబట్టారు. ఆ సమయంలో డబ్బులు కట్టలేక ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టేందుకు ప్రజలు ప్రైవేట్ బ్యాంకుల ముందు బారులు తీరడం కలిచివేసిందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం మోసగించిన టిడ్కో లబ్ధిదారులకు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తి న్యాయం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హత ఉన్న ప్రతిఒక్క పేదవాడికి పారదర్శకంగా స్థలం కేటాయించి.. ఇల్లు నిర్మించి ఇస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధతో రూ. 179.62 కోట్లు వెచ్చించి 428.62 ఎకరాలలో నియోజకవర్గంలో 22,754 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఒక్కో ఇంటికి రూ. లక్షా 80 వేలు చొప్పున రూ. 409.57 కోట్లు మొత్తంగా రూ. 589.19 కోట్లు పేదల గృహాలకు కేటాయించినట్లు వివరించారు. ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వం చేస్తున్న మంచిని గురించి మహిళలు ఆలోచన చేయాలన్నారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. మహిళలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను సుధీర్ఘ పాదయాత్ర ద్వారా తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పథకాన్ని అక్కచెల్లెమ్మల పేరు మీదనే అమలు చేస్తున్నారని తెలిపారు. కానీ నారా లోకేష్ పాదయాత్ర అంతా మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికే సరిపోతోందని.. ఏ ఒక్క రోజు ప్రజా సమస్యలను తెలుసుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. మహిళలందరూ సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటి ముందుకే తీసుకొచ్చి అందిస్తునట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మళ్లీ మహిళలందరి తమ ఆశీర్వాదాలు ఈ ప్రభుత్వానికి అందించాలని, సీఎం జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ బాలి గోవింద్ మాట్లాడుతూ.. పేదవాళ్ల అకౌంట్లలో డబ్బులు పడుతుంటే ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఓయూసిడి కె.శకుంతల, సీడీఓ జగదీశ్వరి, నాయకులు పులపా కృష్ణ, గడ్డం రామకృష్ణ, ఆత్మకూరు సురేష్, పఠాన్ భూపతిరెడ్డి, రాంబాబు, రాడ భాస్కర్ రావు, పప్పుల శివ, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *