-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పదవ తరగతి పరీక్షలలు అత్యంత కట్టుదిట్టమైన నడుమ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహిస్తున్నామని 154 కేంద్రాలలో నిర్వహించే ఇంగ్లీషు పరీక్షకు 27,163 మంది విద్యార్థులు హాజరు అయిన్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు నగరంలోని నిర్మల హైస్కూల్, కోనేరు బసవపున్నయ్య బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించిన్నట్లు తెలిపారు. శనివారం నిర్వహిస్తున్న ఇంగ్లీషు పరీక్షలకు 154 పరీక్ష కేంద్రాల ద్వారా. 27,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారని ఆయన తెలిపారు. 27,396 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 233 మంది విద్యార్థులు గైరహాజరు అయిన్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని ఐదు ఫ్లైయింగ్ స్కాడ్లను, పరీక్ష కేంద్రాలకు 1,354 ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. పరీక్షల కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తుని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా రాత్రి వేళలో విద్యుత్ సరఫరా చేసేలా విద్యుత్ అధికారులకు ఆదేశించామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులను అందుబాటులో ఉంచామన్నారు. పరీక్ష కేంద్రాలలోనికి విద్యార్థులు ఎటువంటి మొబైల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకుండా అన్ని ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పరీక్షల అనంతరం 19వ తేది నుండి 26వ తేది వరకు బిషప్ అజరయ్య పాఠశాలలో స్పాట్ వాల్యేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
మొబైల్ ఫోన్ను డిపాజిట్ చేసుకున్న పోలీస్ ను అభినందించిన జిల్లా కలెక్టర్:
పదవ తరగతి కేంద్రాలను పరిశీలించేందుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు డిఇవో సివి రేణుకల ఫోన్లను పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు డిపాజిట్ చేసుకున్నారు. తొలిత నిర్మల హైస్కూల్ చేరుకున్న జిల్లా కలెక్టర్ వద్ద నుండి బందోబస్తు నిర్వహిస్తున్న పటమట పోలీస్ స్టేషన్ ఎఎస్ఐ యం రామకృష్ణారావు మొబైల్ ఫోన్ను డిపాజిట్ చేసుకున్నారు. పడమట కోనేరు బసవపున్నయ్య బాలుర ఉన్నత పాఠశాలలో బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్ఐ యం రంగనాధుడు జిల్లా కలెక్టర్ డిఇవో మొబైల్ఫోన్లను డిపాజిట్ చేయాలని కోరగా వెంటనే మొబైల్ ఫోను డిపాజిట్ చేసిన జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులను అభినందించారు. పరీక్ష కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితులలో మొబైల్ ఫోను అనుమతించరాదన్న ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించడం పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నారనేదానికి నిదర్శనం అని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
Prajavartha Online Telugu News