విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవీ భాధ్యతలు స్వీకరించిన డా. పి సంపత్ కుమార్ శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మట్లాడుతూ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఉద్యోగుల సమన్యయంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేద్దామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసి పారదర్శకమైన పాలనను అందించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కోరారు.
Prajavartha Online Telugu News