Breaking News

చెప్పులు పంపిణీ

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం సి ఆర్ మైక్రో సెల్యులర్ రబ్బరు చెప్పులు లబ్ధిదారులకు కుష్టి వ్యాధిగ్రస్తులకు హెల్పింగ్ హాండ్స్ వారి కాలనీ బొమ్మూరు నందు బుధవారం చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు స్థానిక బొమ్మూరు నందు ఉన్న ఎవెంజిలిన్ హెల్పింగ్ హాండ్స్ లెప్రసీ కాలనీ నందు డాక్టర్ ఎన్. వసుంధర డిఎల్ఎటివో ఎన్. వసుంధర సందర్శించడం జరిగింది. ఈ సందర్భంలో అక్కడ ఉన్న 27 మంది కుష్టి రోగులకు మైక్రో సెల్యులార్ రబ్బర్ చెప్పులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ ఎన్. వసుంధర మాట్లాడుతూ లెప్రసీ వ్యాధిగ్రస్తులు కాళ్లకు చెప్పులు ధరించడం ద్వారా గాయాల నుండి తప్పించుకొనవచ్చునని అన్నారు. అదేవిధంగా గాయాలు ఉన్నవారు సురక్షితంగా నడవడానికి అనుకూలంగా ఉంటాయని, తగు జాగ్రత్తలు పాటించి గాయాలకు చికిత్స అందించే విధానంలో వైద్య సేవలు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎంవో లు ఈశ్వరరావు ,శివ కుమార్, స్థానిక ఏఎన్ఎం స్థానిక ఆశలు పాల్గొనడం జరిగింది జిల్లా పారామెడికల్ ఆఫీసర్ కె వీరలక్ష్మి కార్యక్రమంలో పాల్గొని తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *