Breaking News

అందరికీ సంక్షేమం.. అభివృద్ధి ఫలాలు

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-277 వార్డు సచివాలయాల పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 63 వ డివిజన్ 277 వ వార్డు సచివాలయం పరిధి సుందరయ్యనగర్లో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి స్థానికులతో మాట్లాడారు. 285 గడపలను సందర్శించి.. ముఖ్యమంత్రి సంతకం చేసిన సంక్షేమ బుక్ లెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ఫలాలు పొందుతున్న ప్రజలు జై జగన్ నినాదాలతో తమ ఆనందోత్సహాల్ని వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన‌దానికంటే ఎక్కువ‌గా, పాద‌యాత్రలో ఇచ్చిన మాట‌కంటే మిన్నగా పాల‌న సాగిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. కనుకనే నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి చెబుతూ ఇంటింటికీ తిరుగుతున్నామ‌ని తెలిపారు. అలా తిరిగే దమ్మూ, ధైర్యం గత పాలకులకు ఎందుకు లేద‌ని ప్రశ్నించారు.

ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు
గత తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి నిరుపేద గడపకు సంక్షేమ ఫలాలు అందాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో సచివాలయ పరిధిలో రూ. 9.44 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో పొందిన లబ్ధిని వివరించారు. జూపల్లి జ్యోతి మాట్లాడుతూ.. జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వాహనమిత్ర, రైతు భరోసా, ఆసరా, సున్నావడ్డీ (రైతులు) పథకాలు వచ్చినట్లు చెప్పారు. మరో లబ్ధిదారు పళ్ల రమేష్ మాట్లాడుతూ.. జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, సున్నా వడ్డీ (డ్వాక్రా), వైఎస్సార్ ఆసరా, విద్యాదీవెన వర్తించినట్లు వివరించారు. తమ కుటుంబాలలో వెలుగులు నింపిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేశారు.

నిలువెల్లా విషాన్ని దాచుకున్న వ్యక్తి చంద్రబాబు
గత తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనను దోపిడీమయంగా మార్చిందని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో 87 శాతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. కనుకనే దేశంలో ఆదర్శ పాలనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారన్నారు. అది చూసి ఓర్వలేక చంద్రబాబు, నారా లోకేష్ లు ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యపై టీడీపీ, ఎల్లో మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రజాదరణ కరువవడంతో ప్రతిపక్షనేత పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నోటికి ఎంత వస్తే, అంత మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిజానికి రాష్ట్రానికి పట్టిన అరిష్టం, దరిద్రం, శని చంద్రబాబేనని.. కరువు కాటకాలకు నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్ అని మల్లాది విష్ణు విమర్శించారు. రాజకీయంగా జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మించిన సైతాన్ దేశంలోనే మరొకరు ఉండరని మల్లాది విష్ణు అన్నారు. మూడు ఎమ్మెల్సీ సీట్లు గెల్చినంత మాత్రాన.. పులివెందుల గూర్చి బాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికీ తెలుగుదేశానికి చాలా చోట్ల అభ్యర్థులు లేర‌ని ఎద్దేవా చేశారు. అందుకే 175 చోట్ల పోటీ చేస్తామని చంద్రబాబు స్పష్టంగా చెప్పలేకపోతున్నారన్నారు. పులివెందుల గూర్చి మాట్లాడుతున్న చంద్రబాబు.. ఈసారి కుప్పంను కాపాడుకుంటే గగనమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు మోదుగుల గణేష్, సీహెచ్ రవి, టెక్యం కృష్ణ, నాగు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *