Breaking News

పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు నాయకత్వం వహించాలి

-సమగ్రశిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులతో పాటు పాఠశాల అభివృద్ధి చెందాలంటే సంబంధిత ప్రధానోపాధ్యాయులు నాయకత్వం వహించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విజయవాడలోని సమగ్ర శిక్షా, సీమ్యాట్ ఆధ్వర్యంలో ‘సమగ్ర పాఠశాల మూల్యాంకన విధానం/ సామాజిక తనిఖీ‌, పర్యావరణ, సామాజిక వ్యవస్థల విధానాల అమలు’పైన జరిగిన ఒకరోజు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీడీ  బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యావ్యవస్థ బలోపేతం కావాలంటే ఉపాధ్యాయులను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సమన్వయం చేసుకుని అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. పాఠశాలలలో సామాజిక తనిఖీ అంటే భయపడాల్సిన అవసరం లేదనీ, స్థానిక ప్రజల్లో ప్రభుత్వ బడుల పనితీరు గురించి అవగాహన పరచడానికే సామాజిక తనిఖీ ఉపయోగపడుతుందన్నారు. విద్యా సంబంధిత అంశాల్లో ఏ పాఠశాలైనా వెనుకబడినట్లు ఉంటే సత్వర పరిష్కారాల దిశగా సోషల్ ఆడిట్ యాప్ వినియోగపడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ‘పాఠశాల సామాజిక తనిఖీ శిక్షణా కరదీపిక’ను రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాస రావు  ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్షా‌ ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి, కైవల్య సంస్థ ప్రతినిధులు ‌సాయికృష్ణ, నాగమ్మ, సమగ్ర శిక్షా సిబ్బంది డా. ఎ.సుహాసిని, డా. పెంచులయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *