-ఉద్యోగ సంఘాలకు బలోపితం చేస్తాం- బండి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గాంధీనగర్ లోని ఎన్జీవో హోమ్ నందు బుధవారం రవాణాశాఖ (నాన్ టెక్నికల్) ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు నేతృత్వంలో ఆ సంఘ నాయకులు ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చెం అందజేశారు. అనంతరం బండి శ్రీనివాసరావుతో సమావేశమైనారు. ఈ సందర్భంగా జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు మాట్లాడుతూ శాఖాపరంగా ఉద్యోగులకు సంబందించిన పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే అసోసియేషన్ కు సంబంధించి జి.ఎ.డి లో పెండింగులో ఉన్న విషయంను ఆయనకు వివరించారు, ఏపీ ఎన్జీవో సంఘం, ఏపీ జేఏసీ తరుపున పూర్తి సహకారం అందించాలని రాజుబాబు కోరారు. ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో సంఘం ఎప్పుడు ఉద్యోగుల పక్షాన పనిచేస్తుందని, ఉద్యోగ సంఘాలకు బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వంలో పెండింగులో ఉన్న ఆర్థిక, ఆర్ధికేతర అంశాల విషయాలపై ఏపీ జేఏసీ తరుపున కూడా జి.ఎ. డి అధికారులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఏ సమస్యలైన పరిష్కరించేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం ఎప్పుడు సిద్ధంగా, అండగా ఉంటుందని బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంలో ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర సహధ్యక్షుడు సిహెచ్. పురుషోత్తమ నాయుడు, రాష్ట్ర కోశాధికారి ఎ.రంగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వి .రమణ తదితరులు ఉన్నారు. సమావేశం అనంతరం రవాణాశాఖ (నాన్ టెక్నికల్) ఉద్యోగుల సంఘం నాయకులు బండి శ్రీనివాసరావుకు వినతిపత్రాన్ని అందజేసారు. ఈ సమావేశంలో రవాణాశాఖ (నాన్ టెక్నికల్) ఉద్యోగుల సంఘం నాయకులు కెవివి నాగమురళి, కె రామచంద్రరాజు, జోగరావు, యం వెంకటేశ్వరరావు, రవాణాశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News