Breaking News

2023 – 24 ఆర్ధిక సంవత్సరానికి గాను వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం పొడిగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ లో భాగంగా, 2023 – 24 ఆర్ధిక సంవత్సరానికి గాను వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సి.ఆర్. ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడెమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి కి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఇందువల్ల గతం లో వున్న మార్గదర్శకాలకు అనుగుణంగా వర్కింగ్ జర్నలిస్టులకు, వారి పై ఆధార పడిన కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఎంపిక చేసిన హాస్పిటల్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా అవసరమైన వైద్య సేవలు పొందే వీలు కలుగుతుందన్నారు. ఈ పథకం అమలులో వర్కింగ్ జర్నలిస్టుల క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారానికి డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సి.ఈ.ఓ శ్రీ హరీంద్ర ప్రసాద్ హామీ మేరకు 104 హెల్ప్లైన్ లో ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు కూడా వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో అందు బాటు లోకి వొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *